*వారాంతపు సమీక్షా సమావేశంలో టౌన్ ప్లానింగ్ సిబ్బందితో సమీక్ష నిర్వహిస్తున్న నగర కమిషనర్ వై ఓ నందన్*

నగరపాలక సంస్థ కమిషనర్ వారాంతపు సమీక్ష సమావేశంలో భాగంగా టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భవన యజమానులు నిర్దేశించిన ప్లాను ప్రకారం కట్టుబడులు జరిగేలా సిబ్బంది అందరూ చర్యలు తీసుకోవాలని, అలాగే భవన నిర్మాణం జరుగు సందర్భంలో పిల్లర్ల దశలోనే గుర్తించి తదుపరి చర్యలు తీసుకొన వలసిందిగా ఆదేశించారు.

ఈ సందర్భంగా కమిషనర్ ప్లానింగ్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ నగరపాలక సంస్థకు ఆదాయ వనరులు పెరిగేలా, అలాగే అనుమతుల ప్రకారం నిర్మాణం జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి ఉదయం జరిగిన ఓపెన్ ఫోరం కార్యక్రమంలో 19 సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించి పరిష్కారాలను అందజేశారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారం పై ప్రజలు హర్ష వ్యక్తం చేశారు.

ఓపెన్ ఫోరం కార్యక్రమంలో సిటీ ప్లానర్ హిమబిందు, డిప్యూటీ సిటీ ప్లానర్ రఘునాథ రావు, ఏసీపీలు, టీపీబివోలు, వార్డు సచివాలయ ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *