
*రోడ్డు వెంబడి ఎలాంటి సూచికలు లేకుండా ఓపెన్ గా భారీ గుంట ఉండటాన్ని గమనించిన కమిషనర్ వెంటనే ఆ ప్రాంతాన్ని సురక్షితం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు స్థానిక మినీ బైపాస్ రోడ్డు హోండా షోరూం గోమతి నగర్ ప్రాంతంలో వాహనచోదకులకు ప్రమాదాలు వాటిల్లకుండా క్రాస్ రోడ్డు వెంబడి ప్రహరీ గోడను ఇంజనీరింగ్ విభాగం అధికారులు మంగళవారం నిర్మించారు.
పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా గత శుక్రవారం ఆ ప్రాంతంలో పర్యటించే సమయంలో రోడ్డు వెంబడి ఎలాంటి సూచికలు లేకుండా ఓపెన్ గా భారీ గుంట ఉండటాన్ని గమనించిన కమిషనర్ వెంటనే ఆ ప్రాంతాన్ని సురక్షితం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా సర్వేపల్లి కాలవపై నిర్మించిన పాదచారుల వంతెన దెబ్బతిని రాకపోకలకు కష్టంగా మారటంతో స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు కమిషనర్ ఆ ప్రాంతాన్ని సందర్శించి మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు.
వంతెన మరమ్మతు పనులను కూడా ఇంజనీరింగ్ విభాగం అధికారులు పూర్తి చేసి రాకపోకలను పునరుద్ధరించారు .