*ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి ఆయా స్థలాలలో హెచ్చరిక నోటీసు బోర్డులను నాటించాలని, యజమానుల నుంచి ఖాళీ స్థలం పన్నులను తప్పనిసరిగా వసూలు చేయాలని సిబ్బందిని ఆదేశించిన కమిషనర్*

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక మాగుంట లేఔట్, డి మార్ట్ పరిసర ప్రాంతాలలో సోమవారం ఉదయం వివిధ భవనాలకు సంబంధించిన అసెస్మెంట్ డిమాండ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

భవనాలకు సంబంధించిన అసెస్మెంట్ డిమాండ్లను కొలతలు వేసి పరిశీలించారు. డివిజన్ పరిధిలోని అన్ని ఆస్తులకు తప్పనిసరిగా అసెస్మెంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.

ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి ఆయా స్థలాలలో హెచ్చరిక నోటీసు బోర్డులను నాటించాలని, యజమానుల నుంచి ఖాళీ స్థలం పన్నులను తప్పనిసరిగా వసూలు చేయాలని కమిషనర్ సిబ్బందిని ఆదేశించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed