
*బుచ్చిరెడ్డి పాళెం మార్కెట్ త్వలోనే ప్రారంభిస్తాం*
– పి4 విధానంలో మార్కెట్ నిర్మాణానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు.
– గ్రేడ్ 2 హోదా పొందిన బుచ్చి పట్టణానికి నూతన మార్కెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
– బుచ్చి మార్కెట్ తరహాలోనే దాతల సహకారంతో పి4 కోవూరులో మార్కెట్ నిర్మాణం చేపడతాం.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో పి4 విధానం ద్వారా మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందుకు వచ్చిన తేజూ డెవలపర్స్ సంస్థ ఎండి శ్రీనివాసులు రెడ్డి గారిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అభినందించారు. బుచ్చి పట్టణంలో నూతనంగా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ ను సందర్శించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణ గార్ల చేతుల మీదుగా త్వరలోనే నూతన మార్కెట్ ప్రారంభోత్సవం చేస్తారన్నారు. గతంలో 24 షాపులు వున్న మార్కెట్ కాంప్లెక్స్ లో ఇప్పుడు కొత్తగా 61 షాపులు నిర్మించడంతో మున్సిపాలిటీకి ఆదాయం పెరగడంతో పాటు 40 మందికి ఉపాధి దొరికిందన్నారు. గ్రేడ్ 2 హోదా పొందిన బుచ్చి పట్టణానికి నూతన మార్కెట్ కాంప్లెక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. బుచ్చిరెడ్డి పాళెం తరహాలోనే కోవూరులో కూడా పి4 విధానం ద్వారా నూతన మార్కెట్ నిర్మాణం చేపడతానన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చి పట్టణ మున్సిపల్ కమీషనర్ డి బాలకృష్ణ, మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, వైస్ చైర్మన్లు యరటపల్లి శివకుమార్ రెడ్డి, నస్రీన్ ఖాన్, తేజూ డెవలపర్స్ సంస్థ ఎండి శ్రీనివాసులు రెడ్డి, పట్టణ టిడిపి అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు, పార్టీ సమన్వయ కర్త కోడూరు కమలాకర్ రెడ్డి పట్టణ టిడిపి యూనిట్, క్లస్టర్ మరియు బూత్ కమిటి కన్వీనర్లు మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.