
*సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యం*
– సచివాలయ సిబ్బంది నెలలో ఒక రోజు ప్రజా సమస్యల పరిష్కారానికి కేటాయించండి .
– అధికారులు, నాయకుల మధ్య సమన్వయం అవసరం.
– తుఫాను సహాయక చర్యలలో టిడిపి నాయకలు పోటీలు పడి సహాయక చర్యలలో పాల్గొన్నారు.
– ఎన్నికలకు ముందు చేసిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నాం.
– కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 18 నెలల్లో 473 మందికి CMRF ద్వారా 5 కోట్ల 53 లక్షలు అందించాం.
– నెలలో ఒక రోజు నాయకులు, సచివాలయ సిబ్బంది కలిసి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలి.
– పెన్నా కరకట్టల మరమత్తులకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
రాష్టానికి చంద్రబాబు నాయుడు గారి లాంటి అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. పెన్షన్ పంపిణి కార్యక్రమంలో భాగంగా కోవూరు మండలం పడుగుపాడు గ్రామ పరిధిలోని బండారు మాన్యం ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. సచివాలయ సిబ్బంది మరియు నాయకులతో కలిసి ఆమె ఇల్లిల్లు తిరిగి పెన్షన్ పంపిణి చేశారు. ఈ స్సందర్భంగా ఆమె యోగ క్షేమాలు విచారిస్తూ స్థానిక సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక ఎన్నికల సందర్భంగా చేసిన ప్రతి హామీ అమలు చేశామన్నారు. సూపర్ సిక్స్ అమలులో భాగంగా నిరాటంకంగా కొనసాగుతున్న కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా వున్నారనన్నారు. 1 వ తేదీ ఆదివారం వస్తే ఒకరోజు ముందుగానే అవ్వా తాతలకు పెన్షన్ అందిస్తూ కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పాలనకు సరికొత్త భాష్యం చెప్పారన్నారు.
చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్టంలో సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 18 నెలల్లో 473 మంది అనారోగ్య పీడితులకు 5 కోట్ల 53 లక్షలు CMRF ద్వారా అందించి ఆదుకున్నామన్నారు. ముంధా తుఫాను సందర్భంగా అధికారులను అప్రమత్తం చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు కొనియాడారు. చంద్రబాబు నాయుడు గారి స్పూర్తితో టిడిపి నాయకులు ఐక్యంగా ఉంటూ పోటీలు పడి తుఫాను సహాయక కార్యక్రమాలలో పాల్గొన్నారన్నారు. ముందు ముందు నాయకులు ఇదే స్పూర్తితో పని చేసి ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. నెలలో ఒక రోజు స్థానిక నాయకులు మరియి సచివాలయ సిబ్బంది కలిసి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మొంధా తుఫాను తుఫాను నష్ట నివారణ చర్యలలో భాగంగా పెన్నా పొర్లుకట్టల మరమ్మత్తులకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దారు సుబ్బయ్య, ఎంపీడీఓ శ్రీహరి, పెన్నా డెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాలరెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ తుమ్మల పార్వతి, టిడిపి సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి, జెట్టి మదన్ మోహన్ రెడ్డి, టిడిపి యూనిట్, క్లస్టర్ ఇంచార్జీలతో పాటు స్థానిక నాయకులూ మరియు బూత్ కమిటీ కన్వీనర్లు పాల్గొన్నారు.