
*ట్రైన్లు కాలువలపై ఇలాంటి నిర్మాణాలను జరపరాదని హెచ్చరించిన కమిషనర్ వై ఓ నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ట్రంకు రోడ్డులో శుక్రవారం పర్యటించారు.
లక్కీ షాపింగ్ మాల్ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు వర్షపు నీరు రోడ్డుపై నిల్వ ఉండటంతో ఆ ప్రాంతంలో డ్రైను కాలువలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కమిషనర్ ఆదేశించారు.
డ్రైను కాలువల నిర్మాణం పనులను పర్యవేక్షించిన కమిషనర్, స్థానిక షాపుల నిర్వాహకులతో మాట్లాడారు. డ్రైను కాలువలను ఆక్రమించవద్దని, డ్రైను కాలువలపై ఎలాంటి నిర్మాణాలు జరపరాదని వారిని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.