
*శివపార్వతుల ఆశీసులు ప్రజలందరిపై ఉండాలి : ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ*
కార్తీక మాసం నేపథ్యంలో కోటి సోమవారం సందర్భంగా శివ పార్వతుల ఆశీసులు ప్రజలందరిపై ఉండాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆకాంక్షించారు.
గురువారం సాయంత్రం నెల్లూరు నగరంలోని మూలాపేటలో ఉన్న శ్రీ మూలస్థానేశ్వరస్వామివారిని, అమ్మవార్లను వారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతమ్మ మాట్లాడుతూ.. కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్తీక మాసానికి ప్రత్యేక విశిష్టత ఉందని చెప్పారు. స్వామివారి ఆశీసులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.