*మాకు ఎంతో ఆప్తులు మాలేపాటి సుబ్బానాయుడు*

*ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ*

– పార్టీ అధికారంలో లేనిరోజుల్లోనే పార్టీని ఇక్కడ నిలబెట్టారు
– ఇద్దరు మంచి లీడర్లను కోల్పోయాం
– తమవంతు మద్దతు మాలేపాటి కుటుంబానికి ఎప్పుడూ ఉంటుంది

ఇటీవల ఆకస్మిక మృతి చెందిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవెలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మాలేపాటి సుబ్బానాయుడు, భాను చందర్‌ల చిత్రపటాలకు నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు నివాళులు అర్పించారు. గురువారం మాలేపాటి సుబ్బానాయుడు, భాను చందర్‌ దశదిన కర్మలో పాల్గొన్న వేమిరెడ్డి దంపతులు.. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు దగదర్తి రావడం విచారకరమన్నారు. పార్టీ అధికారంలో లేనిరోజుల్లోనే పార్టీని నిలబెట్టారని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన ఇద్దరు మంచి నాయకులను కోల్పోవడం బాధాకరమన్నారు. మాలేపాటి సుబ్బానాయుడు తమకు ఎంతో ఆప్తులని, వారి మృతి తీరని లోటన్నారు. దగదర్తి మండల అధ్యక్షుడిగా, కావలి నియోజకవర్గ ఇన్ చార్జిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పార్టీకి, ప్రజలకు ఉత్తమ సేవలు అందించారని గుర్తు చేశారు. మాలేపాటి సుబ్బానాయుడు గారి చివరి కార్యక్రమం మా కోవూరులో జరిగిందని గుర్తు చేశారు. పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేయడమే గాక మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందారని, ఎంతో ఆప్యాయంగా ఉండే కుటుంబసభ్యుడిని కోల్పోయామన్నారు. సుబ్బానాయుడు కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌, ఎంపీ బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed