
*పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 9వ డివిజన్ అంబేద్కర్ నగర్ ప్రాంతంలో గురువారం పర్యటించిన నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్*
స్థానికంగా తాగునీటి సరఫరా, రోడ్లు, విద్యుత్ దీపాలు, పారిశుధ్య నిర్వహణ తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు కమిషనర్ ను విజ్ఞప్తి చేశారు.
అంబేద్కర్ నగర్ ప్రాంతంలో అన్ని మౌలిక వసతులను కల్పించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కువ్వారపు బాలాజీ,నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.