*ముందస్తు సహాయక చర్యలతో ప్రాణ నష్టం నివారించగలిగాం* – సిఎం చంద్రబాబు నాయిడు నిరంతర పర్వేక్షణతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. – పరస్పర సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు, నాయకులకు అభినందనలు – పార్లపల్లి గ్రామంలో కూలిపోయే పరిస్థితిలో వున్న ఇళ్లను పునర్ నిర్మిస్తాం. – పునరావాస ప్రాంతాలలో తలదాచుకుంటున్న వరద బాధితులకు ప్రభుత్వం ఆదుకుంటుంది. – తుఫాను ప్రభావిత గ్రామాలలో పర్యటించి బాధితులను పరామర్శించిన ఎమ్మెల్ల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*ముందస్తు సహాయక చర్యలతో ప్రాణ నష్టం నివారించగలిగాం*

– సిఎం చంద్రబాబు నాయిడు నిరంతర పర్వేక్షణతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
– పరస్పర సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు, నాయకులకు అభినందనలు
– పార్లపల్లి గ్రామంలో కూలిపోయే పరిస్థితిలో వున్న ఇళ్లను పునర్ నిర్మిస్తాం.
– పునరావాస ప్రాంతాలలో తలదాచుకుంటున్న వరద బాధితులకు ప్రభుత్వం ఆదుకుంటుంది.
– తుఫాను ప్రభావిత గ్రామాలలో పర్యటించి బాధితులను పరామర్శించిన ఎమ్మెల్ల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలలతో అధికారులు మరియు నాయకులు ముంపు గ్రామ వాసులను సురక్షిత ప్రాతాలకు తరలించడం వల్ల ప్రాణ నష్టం నివారించగలిగామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో ఎస్టీ కాలనీలో మొంధా తుఫాను ధాటికి కూలిపోయిన ఇళ్లను ఆమె పరిశీలించారు. 44 కుటుంబాలకు చెందిన 100 మందికి పైగా గిరిజనులు ఆశ్రయం పొందుతున్న పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ముంపుకు గురయ్యే అవకాశం వున్న గిరిజన కాలనీ వాసులను అధికారులు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా తరలించడంతో ప్రాణ నష్టం తప్పిందన్నారు. పరస్పర సమన్వయంతో పని చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టిన అధికారులు మరియు నాయకులను ఆమె అభినందించారు.

కూలిపోయే దశలో వున్న పార్లపల్లి గిరిజన కాలనీ ఇళ్ల దుస్థితి గురించి కలెక్టర్ దృష్టికి తీసుకురాగా గిరిజనుల ఇళ్ల పునర్నిర్మాణానికి ప్రభుత్వం సమ్మతించిందని తెలిపారు. గిరిజన కాలనీ పునర్నిర్మించే వరకు వారికి తాత్కాలిక నివాసాలు ఏర్పాటు ఏర్పాటు చేస్తామన్నారు. పునరావాస కేంద్రాలలో తలదాచుకుంటున్న వరద బాధితులకు ప్రభుత్వం 3 వేల రూపాయల ఆర్ధిక సహాయంతో పాటు 25 కిలోల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ వంట నూనె కిలో ఉర్లగడ్డలు మరియు కిలో ఎర్రగడ్డలు అందచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఎఇ వెంకటేశ్వర్లు రెడ్డి, తహసీల్దారు చంద్రశేఖర్, ఎంపీడీఓ నగేష్ కుమారి పార్లపల్లి సర్పంచ్ రామిశెట్టి స్వాతి, విడవలూరు టిడిపి మండల అధ్యక్షలు ఏటూరు శ్రీహరి రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, స్థానిక టిడిపి నాయకులు తాత బాలకృష్ణ, అడపాల జనార్ధనరెడ్డి, రామిశెట్టి వెంకటేశ్వర్లు మరియు పందుల ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed