
*స్థానిక తల్పగిరి కాలనీ, రెవెన్యూ కాలనీ, విక్రమ్ నగర్ ప్రాంతాలలో బుధవారం పర్యటించిన నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్*
నెల్లూరు నగరవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా డ్రైను కాలువల పూడికతీత పనులను పర్యవేక్షించారు.
అవసరమైన ప్రాంతాలలో జెసిబి, బ్రేకర్ల సహాయంతో కాలువలను తవ్వి వరద నీరు ప్రవహించేలా కమిషనర్ చర్యలు తీసుకున్నారు.
ప్రధాన మార్గాల వెంబడి వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని స్థానిక అధికారులను కమిషనర్ ఆదేశించారు.
నగరవ్యాప్తంగా ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలలో ప్రజలకు అల్పాహారం అందజేశారు. కేంద్రాలలో నిర్వాసితులకు అన్ని వసతులు అందేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు.
కమిషనర్ ఆదేశాల మేరకు స్థానిక 24వ డివిజన్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంతంలోని గిరిజన కాలనీ, ఎస్సీ కాలనీ ప్రజలకు, ఇందిరమ్మ కాలనీ ప్రాంతంలో సర్కస్ వృత్తుల వారికి, బేడా బుడమజంగం సంచార జాతుల వారికి అల్పాహారం పొట్లాలను వార్డు సచివాలయ కార్యదర్శులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.