
*మంత్రి నారాయణ వ్యూహాత్మక ఆలోచనలతో తుఫాన్ విపత్కర పరిస్థితులకు చెక్*
– నెల్లూరులో గంట గంటకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు, టీడీపీ శ్రేణులకు సూచనలు ద్వారాచేస్తున్న మంత్రి నారాయణ
– మంత్రి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న టిడిపి శ్రేణులు, అధికారులు.
– పునరావాస కేంద్రాల్లో వసతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న కమిషనర్ నందన్
– క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన టిడిపి శ్రేణులు
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారి వ్యూహాత్మక ఆలోచనలు సత్ఫలితాలను ఇచ్చాయి. విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎదుర్కోవాల్సిన చర్యలను ముందస్తుగా చేపట్టడంతో ప్రస్తుతం నెల్లూరు ప్రజలంతా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నామంటూ పలువురు అంటున్నారు. మంత్రి నారాయణ గారి ముందుచూపు మేరకు గతంలో అధికారులను పురమాయించి సిబ్బంది చేత ఎప్పటికప్పుడు కాలువల్లో పూడికలు తీయించడం వల్ల ప్రస్తుతం కురుస్తున్న మొంథా తుఫాన్ తో వచ్చే నీరు నిల్వ లేకుండా సులువుగా దిగువకు వెళ్ళిపోతుంది. దీంతో పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు నెల్లూరులో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గంట గంటకు అధికారులను, టిడిపి శ్రేణులను టెలికాన్సూరెన్స్ ద్వారా పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ చేపట్టాల్సిన చర్యలపై దిశ నిర్దేశం చేస్తున్నారు. దీంతో నెల్లూరు సిటీ పరిధిలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి కమిషనర్ నందన్ దగ్గరుండి వసతులను కల్పిస్తున్నారు. నెల్లూరు నగర ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పడకూడదన్న మంత్రి నారాయణ ఆదేశాల మేరకు అధికారులు, టిడిపి శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించి తుఫాన్ విపత్కర పరిస్థితిలను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేస్తూ ప్రజలకు భరోసాగా నిలుస్తున్నారు. 24 గంటలు పాటు నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నిర్వహణ తీరు ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అందుతున్నాయి. నెల్లూరు సిటీ పరిధిలో చేపడుతున్న సహాయక చర్యలు, అధికారులు చేపట్టాల్సిన పనులు, క్షేత్రస్థాయిలో టిడిపి శ్రేణులు చేస్తున్న సేవలు, ఇతర అంశాలపై మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ టెలి కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు సలహాలు అందజేస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో బస చేస్తున్న వారికి మూడు పుట్ల భోజనం ఏర్పాటు చేయాలని, వసతులు కల్పించాలని మంత్రి ఆదేశించారు. అలాగే గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు వెంటనే పట్టలు పంపిణీ చేయాలని తద్వారా వానకు ఉపశమనం కలుగుతుందని వారికి సహాయక చర్యలు చేపట్టాలంటూ మంత్రి టిడిపి శ్రేణులకు తెలియజేశారు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన అధికారులను, టిడిపి శ్రేణులను అభినందిస్తూ, మరోవైపు ప్రజలకు తానున్నానంటూ ధైర్యం ఇస్తూ మంత్రి నారాయణ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మంత్రి ఆదేశాల మేరకు టిడిపి శ్రేణులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు ఈ క్రమంలో ఆయా డివిజన్లోని పలుచోట్ల పడిపోయిన పెద్ద పెద్ద చెట్లను తొలగించడంతోపాటు, అక్కడక్కడ గాలులకు నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను సరి చేయిస్తున్నారు. ఆయా డివిజన్లోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు భోజనం ప్యాకెట్లను అందించడం ఇతర సహాయక చర్యలు చేపట్టడం వారికి ధైర్యం చెప్పడం మంత్రి ఆదేశాల మేరకు జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా అధికారులకు తెలియజేయాలంటూ ప్రజలకు మంత్రి సూచిస్తున్నారు..