
*పొదలకూరు రోడ్డు రామకోటయ్య నగర్ ప్రాంతంలో రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోయింది అన్న సమాచారం తెలుసుకుని సోమవారం ఆ ప్రాంతాన్ని తనిఖీ చేసిన నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్*
వర్షపు నీరు డ్రైను కాలువల ద్వారా ప్రవహించేందుకు అవసరమైన పూడికతీత పనులను కమిషనర్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
కమిషనర్ ఆదేశాల మేరకు రోడ్డుపై చేరిన వరద నీరు ప్రవహించేందుకు డ్రైను కాలువను అనుసంధానిస్తూ రోడ్డు పక్కగా కాలువను తవ్వించి ప్రవాహం సాఫీగా జరిగేలా నూతనంగా డ్రైను మార్గం ఏర్పాటు చేశారు.
నగరవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లపై వర్షపు నీరు నిలిచే వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.