జగన్ తాగుబోతులా మాట్లాడుతున్నాడు : నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆగ్రహం

బాలకృష్ణ ను విమర్శిస్తే నాలుక కోస్తా : నుడా చైర్మన్ కోటంరెడ్డి ఫైర్

సైకో జగన్ కు బాలకృష్ణని విమర్శించే అర్హత లేదు.
– nuda చైర్మన్ కోటంరెడ్డి.

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఇప్పుడు జగన్ బాలకృష్ణ గారిని విమర్శించడం జగన్ సైకోతనానికి నిదర్శనం.

నీచ సంస్కృతి, రౌడీ సంస్కృతి దోపిడి, దౌర్జన్య సంస్కృతితో రాష్ట్రాన్ని దోచుకొని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్ నువ్వు 50 సంవత్సరాల సుదీర్ఘ కళామతల్లి సేవలో చరిత్ర సృష్టించిన బాలకృష్ణను విమర్శించడమా?

జగన్ ముందు నీ మానసిక పరిస్థితి తెలుసుకో బాలకృష్ణను తిట్టే అర్హత నీకుందా? నీకంటే దొంగ, దోపిడీ దారుడు. “జె బ్రాండ్” మద్యంతో పేదల బతుకులు బుగ్గి చేసిన ద్రోహి ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క జగన్ మాత్రమే.

గౌరవప్రదమైన విశిష్టమైన ప్రెసిడెంట్ మెడల్ పేరును నీ “జె బ్రాండ్” మందుకు పెట్టావంటే అంతకంటే సైకోతనం ఎక్కడన్నా ఉంటుందా జగన్, ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడు.

తాగుబోతు జగన్ నీలాంటి నీచమైన వ్యక్తి మా బాలకృష్ణ గారిని విమర్శించడం ఆశ్చర్యంగా ఉంది. స్పీకర్ చర్యలు తీసుకోవాలి అని మాట్లాడావు. అసలు నీ పార్టీ అసెంబ్లీలో పద్ధతిగా మాట్లాడే పార్టీయేనా?
బూతుల సంస్కృతికి అసెంబ్లీలో అసభ్య పదాల సంస్కృతికి ప్రోత్సహించింది నువ్వు కాదా అని అడుగుతున్నాను.

దేవుడులాంటి ఎన్టీఆర్ బిడ్డ భువనేశ్వరుని నిండు సభలో అవమానించింది మీ ఎమ్మెల్యేలు కాదా అని అడుగుతున్నా.
బూతులు మాట్లాడే వంశీ కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలను సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లను ప్రోత్సహించింది నువ్వు కదా.

భువనేశ్వరీ గారిని విమర్శించిన రోజు నీకు సిగ్గు అనిపించలేదా.
ఆస్తి కోసం తల్లిని చెల్లిని ఇంటినుంచి గెంటేశావ్, రాజకీయం కోసం బాబాయ్ ను హత్య చేయించావ్, ఇంతకంటే నీచ సంస్కృతి ఎవ్వరికైనా ఉందా?

నీ వైసీపీ ప్రభుత్వంలో వందలాదిమంది తెలుగుదేశం కార్యకర్తలను చంపించింది నువ్వు కాదా అని అడుగుతున్నాను. హత్యా రాజకీయాలు దోపిడీ రాజకీయాలు దౌర్జన్యాలతో రాష్ట్రాన్ని నిలువునా ముంచేసి ఎక్కడికో పాతాళానికి తొక్కేస్తే చంద్రబాబు గారు ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు.

చంద్రబాబు లోకేష్ గార్లు రాష్ట్రంలో పెట్టుబడులు సేకరించడానికి, పరిశ్రమలు తేవడానికి నిద్రాహారాలు లేకుండా దేశ దేశాలు తిరుగుతుంటే, జగన్ తన పాలనలో తాడేపల్లి గేటు దాటి బయటకు రాకుండా రాష్ట్రాన్ని నాశనం చేశారు.

చేతగాని దద్దమ్మ జగన్ నువ్వు బాలకృష్ణ విమర్శించే ముందు నీ మానసిక పరిస్థితిని ఒక్కసారి మంచి వైద్యుడు చూపించుకో.

చంద్రబాబు రాష్ట్రానికి కష్టపడి గూగుల్ తెస్తే దాన్ని కూడా విమర్శిస్తున్నావంటే నీలో సైకోతనం ఏ స్థాయిలో ఉందో బట్టబయలయింది.

స్కూలుకు పోయే పిల్లవాడు స్కూలుకు పోకుంటే ఆబ్సెంటేసి పరీక్షలకు హాజరు కానివ్వరు. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి పోవడం లేదంటే సిగ్గు లేదా అని అడుగుతున్నా.

అసెంబ్లీకి పోని వ్యక్తివి రాష్ట్రాన్ని గురించి ఏం ఆలోచిస్తావ్
జగన్.
ముందు నీ మానసిక పరిస్థితిని చక్కదిద్దుకో.
లక్షలాదిగా ఉన్న బాలకృష్ణ అభిమానులు ఒక్కసారి ఉమ్మి వేస్తే ఆ ఉమ్మిలో కొట్టుకు పొయ్యే నువ్వు బాలకృష్ణ గురించి మరొకసారి మాట్లాడితే నాలుక కోసేస్తామని హెచ్చరిస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed