
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 38 వ డివిజన్ ప్రాంతంలో గురువారం పర్యటించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్థానికంగా అందుకున్న సమస్యను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు సంబంధిత విభాగం అధికారులతో కమిషనర్ ప్రత్యక్షంగా పాల్గొని విచారించారు. అర్జీదారులకు శాశ్వత పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం డివిజన్ పరిధిలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ప్రాంగణంలో పరిశుభ్రతను కమిషనర్ పరిశీలించారు. డివిజన్ వ్యాప్తంగా డ్రైను కాలువలలో వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా తొలగించేలా నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్
సూచించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.