రేపు కర్నూలులో రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని మోదీ.

రూ.2,880 కోట్లతో కర్నూలు-3 పూలింగ్‌ స్టేషన్‌ను అనుసంధానించేలా ఏర్పాటుచేసిన ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని.

రూ.4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో పనులకు ప్రధాని శంకుస్థాపన.

రెండు కారిడార్లలో సుమారు రూ.21 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తాయన్న కేంద్రం.

రెండు కారిడార్ల ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని ప్రకటించిన కేంద్రం.

రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్లు ఆస్కారం కల్పిస్తాయన్న కేంద్రం.

రూ.960 కోట్లతో సబ్బవరం-షీలానగర్‌ రహదారికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని.

రూ.1,140 కోట్లతో పీలేరు-కాలురు నాలుగు వరుసల రహదారి విస్తరణకు శంకుస్థాపన.

గుడివాడ-నూజెండ్ల మధ్య రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed