జోహో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది — స్వదేశీ సత్తా ప్రపంచానికి చెమట్లు!

గూగుల్, మైక్రోసాఫ్ట్‌లకు గట్టి పోటీగా జోహో — ‘వోకల్ ఫర్ లోకల్’కి సాక్ష్యం!

150 దేశాల్లో జోహో విజృంభణ — ప్రపంచం ఇప్పుడు భారత టెక్ శక్తిని చూసే సమయం!

(మేనేజింగ్ డైరెక్టర్, చిలక డిజిటల్ సొల్యూషన్స్ )

నెల్లూరు: స్వదేశీ సత్తా ప్రపంచానికి ఎలా చెమట్లు పట్టిస్తోంది అన్నది. ఒకప్పుడు అమెరికా భారత్‌ను ఆంక్షలతో భయపెట్టాలని చూస్తే, ఇప్పుడు అదే అమెరికా భారత్ పరిచయం చేస్తున్న భయాన్ని అనుభవిస్తోంది. మోదీ సర్కార్ ‘తగ్గేదేలే’ అంటుంటే, జోహో వంటి భారతీయ సంస్థలు అమెరికా టెక్ దిగ్గజాలకు నిజంగా గట్టిపోటి ఇస్తున్నాయనీ చిలక డిజిటల్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ చిలకా ప్రవీణ్ అన్నారు.. ఆయన మాట్లాడుతూ కేంద్రం సపోర్ట్‌తో జోహో ఇప్పుడు జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు మన మార్కెట్‌లో ఏకాధిపత్యం చూపించిన రోజులు నెమ్మదిగా ముగియబోతున్నాయి. దేశం మొత్తం ఇప్పుడు చెప్పుకుంటున్న మాట ‘జోహోతో అమెరికా టెక్ దిగ్గజాలకు చెమట్లు!’ ప్రధాని మోదీ గారి ‘వోకల్ ఫర్ లోకల్’, ‘ఆత్మనిర్భర్ భారత్’ పిలుపు కేవలం నినాదం కాదు అది ఇప్పుడు రియాలిటీగా మారింది. స్వదేశీ టెక్నాలజీ, స్వదేశీ ఆలోచన, స్వదేశీ ఉత్పత్తులు — ఇవే భవిష్యత్తు దిశ. జోహో సంస్థ హిస్టరీ చూస్తే మనందరికీ గర్వం కలగాలి అన్నారు.ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో 10 కోట్ల మంది యూజర్లతో జోహో నిలబడింది. జోహోలో ఈమెయిల్, అకౌంటింగ్, హెచ్ఆర్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, సిఆర్ఎమ్ వంటి 55కి పైగా క్లౌడ్ ఆధారిత టూల్స్ ఉన్నాయి. వీటితో వ్యాపారాలు మరింత స్వతంత్రంగా, సురక్షితంగా ఎదుగుతున్నాయి. మైక్రోసాఫ్ట్ లేదా గూగుల్‌తో పోలిస్తే జోహో సర్వీసులు తక్కువ ధరలో, అధిక సెక్యూరిటీతో అందుబాటులో ఉన్నాయి. డేటా ప్రైవసీకి ప్రాధాన్యత, యాడ్ ఫ్రీ ఇంటర్‌ఫేస్ — ఇవే జోహో ప్రత్యేకతలు. గూగుల్ జిమెయిల్‌కి ప్రత్యామ్నాయంగా జోహో మెయిల్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కి ప్రత్యామ్నాయంగా జోహో వర్క్‌స్పేస్ ఇప్పుడు వేగంగా ప్రజాదరణ పొందుతున్నాయి. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా గారు జోహో మెయిల్ మరియు టూల్స్ ఉపయోగించడం ప్రారంభించడంతో ఈ ఉద్యమం మరింత బలపడిందన్నారు. ఇదే సమయంలో జోహో రూపొందించిన ‘అరట్టై’ యాప్ కూడా దుమ్మురేపుతోంది. అరట్టై — తమిళంలో ‘క్యాజువల్ చాట్’ అని అర్థం. ఇది 2021లోనే లాంచ్ అయినప్పటికీ, ఇప్పుడు వాట్సాప్‌కు నిజమైన ప్రత్యామ్నాయం అయింది. అరట్టైలో వన్ టు వన్ చాట్, గ్రూప్ చాట్, వీడియో షేర్, వాయిస్ నోట్, స్టోరీస్, బ్రాడ్‌కాస్ట్ చానల్స్ అన్నీ ఉన్నాయి. ఇది క్లియర్, స్పైవేర్ ఫ్రీ, ప్రైవసీ ఫ్రెండ్లీ యాప్. ఇంతవరకు ప్లే స్టోర్‌లో కోటి డౌన్‌లోడ్స్ దాటింది, 4.8 రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉంది. ఈ యాప్ గ్రోత్ చూసి టెక్ ఎక్స్పర్ట్స్ కూడా షాక్ అవుతున్నారు. స్వదేశీ టెక్నాలజీపై మోదీ సర్కార్ ప్రోత్సాహం, సోషల్ మీడియా బజ్ కలిసిపోవడంతో ఇది కొత్త చరిత్ర సృష్టిస్తోంది. అదే సమయంలో జోహో పేమెంట్స్ కూడా విస్తరిస్తోంది — డెబిట్, క్రెడిట్ కార్డు, క్యూ ఆర్ కోడ్ చెల్లింపులు, పిఓఎస్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అంటే ఇప్పుడు జోహో పూర్తి ఎకోసిస్టమ్‌గా ఎదుగుతోంది. విదేశీ సంస్థలపై ఆధారపడటం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి డబ్బు బయటికి పోతుంది, మన డేటా కూడా బయట దేశాల సర్వర్లలోకి వెళ్తుంది. ఈ పరిస్థితికి ఎండ్ చెప్పేది స్వదేశీ యాప్‌లు, స్వదేశీ సాఫ్ట్‌వేర్‌లు మాత్రమే. చైనా యాప్‌లను బ్యాన్ చేసినప్పుడు మనకు ప్రత్యామ్నాయాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు జోహో, అరట్టై వంటి ఆవిష్కరణలు భారత్‌ను సైబర్ స్వావలంబన వైపు తీసుకెళ్తున్నాయి. మన దేశంలో ఉన్న టాలెంట్ ప్రపంచంలో ఎక్కడా లేదు. అదే టాలెంట్‌ను మన దేశ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే భారత్ టెక్నాలజీ లీడర్‌గా అవుతుందన్నారు .మనం మన యాప్‌లు వాడాలి, మన సాఫ్ట్‌వేర్‌లను అభివృద్ధి చేయాలి, మన డేటా మన చేతుల్లో ఉండాలి — ఇదే నిజమైన డిజిటల్ స్వాతంత్ర్యం. జోహో, అరట్టై విజయాలు చూపుతున్నాయి , భారత్ ఇప్పుడు ఎవరి కిందా కాదు, తన సత్తా ప్రపంచానికి నిరూపిస్తున్న దేశం. ఇదే భారత టెక్ విప్లవం. ఇదే స్వదేశీ గర్వం. ఇదే భవిష్యత్తు దిశ అన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed