
*రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలి అని వర్షాల వల్ల నష్టపోయిన రైతులను గుర్తించి నష్టపోయిన వారికి నష్టపరిహారం అందించాలని రైతులకు ఈసారి ఖరీఫ్ పంటలో ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కి వినత పత్రం అందజేసిన ఆర్ పి ఐ పార్టీ నేతలు*
ఈరోజు కలెక్టరేట్లో రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలి అని వర్షాల వల్ల నష్టపోయిన రైతులను గుర్తించి నష్టపోయిన వారికి నష్టపరిహారం అందించాలని రైతులకు ఈసారి ఖరీఫ్ పంటలో ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలని కలెక్టరేట్లో తిక్కన భవన్ పి జి ఆర్ ఎస్ గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ గారికి వినత పత్రం అందజేసిన ఆర్ పి ఐ పార్టీ నేతలు
వినత పత్రం అందజేసిన అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎస్ కె మాబు మీడియాతో మాట్లాడుతూ రైతులకు దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని వర్షాల వల్ల నష్టపోయిన రైతులను గుర్తించి నష్టపోయిన వారికి నష్టపరిహారం అందించాలని రైతులకు ఈసారి ఖరీఫ్ పంటలో ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ గారిని కోరినట్టు ఆయన తెలియజేశారు
రైతులు ఈ ప్రపంచానికి వెన్నెముక లాంటి వారిని అలాంటి రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు రైతులకు గత ఏడాది లాగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసే వారి వారి బ్యాంకు ఖాతాల్లో నగదు చెల్లించాలన్నారు
ఈసారి ప్రస్తుతం పండించిన పంటకు గత సంవత్సరం తరహాలో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జిల్లాలో అభం శుభం తెలియని రైతులకు మాయ మాటలు చెప్పి రైతుల కష్టాలను దోచేస్తున్న దళారీ వ్యవస్థను తరిమికొట్టి వారి పైన చట్టపరంగా శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఉక్కు పాదంతో అణిచివేయాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టపు రంగారావు ఉపాధ్యక్షులు బత్తల మధుసూదన్ దుంపల సుబ్బారావు. నంబూరు గణేష్ ఉప్ప నూరు మాలకొండయ్య తూపిలి వంశీకృష్ణ బెల్లంకొండ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు