

1000 కి పైగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ సేవలు ఒకే యాప్ (UMANG)
UMANG యాప్ పై ప్రజల్లో అవగాహన అవసరం – జాయింట్ కలెక్టర్ హామీ”
నెల్లూరు, సెప్టెంబర్ 15: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేవలు, పథకాలు 1000 కి పైగా ఒకే యాప్ ఉమాంగ్( UMANG ) లో లభించడం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు డిజిటల్ పాలనను చేరువ చేయడానికి తీసుకొచ్చిన ఉమంగ్ యాప్ చాలా ఉపయోగకరమైనదని, బిజెపి మాజీ జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ పేర్కొన్నారు.
ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ “550” పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకి తెలియక అవగాహన లేక వీటిని ఉపయోగించలేక పోతున్నారు…
ఈ యాప్ ద్వారా గ్రామీణ ప్రజలు ప్రభుత్వ కార్యాలయానికి రాకుండా ఇంటి వద్దనే కేంద్ర ప్రభుత్వ పథకాలు అప్లై చేసుకుని వినియోగించవచ్చు అన్నారు ఆధార్, డిజిలాకర్, పాస్పోర్ట్, స్కాలర్షిప్, EPFO, ఆరోగ్య సేవలు వంటి అనేక సేవలు ఒకే యాప్ ద్వారా అందుబాటులోకి రావడం ప్రజల జీవనాన్ని మరింత సులభతరం చేస్తోందని వివరించారు.
తెలుగు సహా 13 భాషల్లో యాప్ అందుబాటులో ఉండటం గ్రామీణ ప్రజలకు కూడా మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ,(UMANG) Unified Mobile Application for New-age Governance యాప్ వచ్చిచాలా కాలం అయినప్పటికీ యువత, రైతులు, ప్రజలు మరియు మహిళలలో ఈ యాప్ గురించి సరైన అవగాహన లేదన్నారు..
ఈ విషయమై జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తిక్ కి అర్జీ సమర్పించగా, ఆయన సానుకూలంగా స్పందించి జిల్లా వ్యాప్తంగా త్వరలో అవగాహన కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ప్రతి పౌరుడు UMANG యాప్ డౌన్లోడ్ చేసి వినియోగించుకోవాలని, ఇది డిజిటల్ ఇండియా లక్ష్యానికి పెద్ద అడుగని, ప్రజల జీవితాలను మరింత సులభతరం చేసే ఈ యాప్ను అందరూ వినియోగించుకోవాలని ప్రవీణ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రామలింగాపురం మండల ప్రధాన కార్యదర్శి కిరణ్, బిజెపి సీనియర్ నాయకులు బెల్లంకొండ రామకృష్ణ, తిరువీధి నారాయణ, సాయి, ప్రదీప్, మహేష్ ,తదితరులు పాల్గొన్నారు