
*”సోమిరెడ్డికి ఛాలెంజ్ విసిరిన కాకాణి”*
*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:12-09-2025*
*నెల్లూరు నగరం, డైకస్ రోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సోమిరెడ్డి అవినీతిపై ఛాలెంజ్ విసిరిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*
*కాకాణి మాట్లాడుతూ..:*
– సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని అనుమతులతో గ్రావెల్ తరలిస్తున్నారని సోమిరెడ్డి మీడియా సాక్షిగా మాట్లాడాడు.
– *నేను ఛాలెంజ్ విసురుతున్నా…*
– సర్వేపల్లి నియోజకవర్గంలో, వెంకటాచలంలో, నాగంబుట్ల వారి కండ్రిగలో జరుగుతున్న గ్రావెల్ త్రవ్వకాలకు ఎంత మేర అనుమతులున్నాయో, ఎంత గ్రావెల్ త్రవ్వకాలు జరిగాయో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఆధారాలతో సహా సోమిరెడ్డి చూపించాలి.
– *”నేను లావే.. నాకు తినింది తిన్నట్లు ఒంటికి పడుతుంది. సోమిరెడ్డి లాగా కుళ్ళు, కుతంత్రాలు నాలో లేవు”*.
– మీడియాను గ్రావెల్ తవ్వకాలు జరిగే ప్రదేశానికి తీసుకొని వెళ్లి, గ్రావెల్ త్రవ్వకాలు, వాటి తాలూకు అనుమతులు చూపించే దమ్ము సోమిరెడ్డికి ఉందా!
– లీగల్ గా గ్రావెల్ ఎత్తుతుంటే, చెత్తాచెదారాలతో గుంతలు పూడ్చాల్సిన అవసరం ఏముంది!
– నాపై సోమిరెడ్డి పెట్టిన కేసులకు, చేసిన ఆరోపణలకు సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నా!
– ఇప్పటికే సిబిఐ ఒకదఫా క్లీన్ చీట్ ఇచ్చింది మరలా విచారణకు సిద్ధం!
– సోమిరెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలపై సిబిఐ విచారణకు సిద్ధపడాలి.
– ప్రభుత్వం వాళ్లదే కనుక సిబిఐ విచారణ చేయించి, గతంతో పాటు, ప్రస్తుతం సర్వేపల్లిలో జరుగుతున్న అవినీతిని నిగ్గుతేల్చాలి.
– జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే చంద్రబాబు మంత్రి పదవి అవకాశం ఇస్తాడనే భ్రమలో సోమిరెడ్డి ఉన్నాడు.
– సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కాలిగోటికి కూడా సరిపోదు.
– జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి సోమిరెడ్డికి లేదు.
– రాష్ట్రంలోని బస్సులన్నీ మళ్లించి, సూపర్ సిక్స్ సభకు పంపారు.
– రాష్ట్రంలోని పోలీసులు అందరినీ సభలో పెట్టుకున్నారు.
– సూపర్ సిక్స్ సభకు రాని వారిపై ఫైన్లు వేశారు, అన్నదాత పోరు కార్యక్రమానికి వస్తే కేసులు పెట్టారు.
– మీరు ఎన్ని కేసులు పెట్టినా, సూపర్ సిక్స్ సభ కంటే ఎక్కువ మంది అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
– అధికారాన్ని చూపినా, సూపర్ సిక్స్ సభకు జనాల్లో ఆదరణ కరువైంది.