*”ముస్లిం ద్రోహి చంద్రబాబు” – కాకాణి*

*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:08-09-2025*

*నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జరుగుతున్న గ్రీవెన్స్ డే లో మస్జీద్ ల, పర్యవేక్షణ ప్రార్ధనలు నిర్వహించే ఇమామ్, మౌజన్ లకు గౌరవ వేతనం వెంటనే చెల్లించాలని కోరుతూ, ఇమామ్ లు, మౌజన్ లు, శాసనమండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మైనారిటీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*జిల్లా నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన ఇమామ్ లు, మౌజన్ లు*

*”ముస్లిం ద్రోహి చంద్రబాబు” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు*

*స్క్రోలింగ్ పాయింట్స్:*

– జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మసీదుల పర్యవేక్షణ ప్రార్ధనలు చేసేటువంటి మౌజన్ లకు 5వేలు, ఇమామ్ లకు 10 వేల రూపాయలు గౌరవ వేతనం అందించారు.

– చంద్రబాబు ఎన్నికల్లో మౌజన్ లకు, ఇమామ్ లకు గౌరవ వేతనం పెంచుతానని మసీదుల పర్యవేక్షణ కొరకు ప్రతి నెల రూ.5000/-లు ఇస్తానని హామీ ఇచ్చాడు.

– చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేసినట్లు పవిత్రంగా ప్రార్థన చేసే ఇమామ్ లకు, మౌజన్ లకు కూడా ద్రోహం చేశాడు.

– మస్జీద్ పర్యవేక్షణ కొరకు చందాలు ఇచ్చే దాతలు ప్రభుత్వం ఇస్తుందనే భావనతో, ముందుకు రావడం లేదు.

– 14 నెలల నుండి ఇమామ్లకు, మౌజన్లకు గౌరవ వేతనం అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

– మైనారిటీల మైనారిటీల అభివృద్ధి మహానేత వైయస్సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది.

– మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మైనారిటీలలో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారు.

– జగన్మోహన్ రెడ్డి గారు దుల్హన్ పథకం కింద పేద ముస్లిం ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్ధిక చేయూత అందించారు.

– చంద్రబాబు రాగానే దుల్హన్ పథకం నిర్వీర్యం అయిపోయింది.

– సమాజం మంచి కోసం ప్రార్థనలు చేసే ఇమామ్ లకు, మౌజన్లకు అన్యాయం చేయడం చంద్రబాబుకు మంచిది కాదు.

– ఇమామ్ లకు, మౌజన్లకు అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో గౌరవ వేతనం వెంటనే విడుదల చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాం.

– జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు, ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.

– చంద్రబాబు ప్రభుత్వం ఇమామ్, మౌజన్ లకు గౌరవ వేతనం ఇచ్చేంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed