*కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా బిజేవైఎం ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ*

నెల్లూరు, జూలై 26:
కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన భారత జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ, కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని ఈరోజు బిజేవైఎం జిల్లా అధ్యక్షుడు అశోక్ నాయుడు ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది. ఈ ర్యాలీ వీఆర్సీ సెంటర్ నుండి ప్రారంభమై నగరంలోని ప్రధాన రహదారులపై గాంధీ బొమ్మ వద్ద ముగిసింది.

పతాకాలు, జాతీయ జెండాలు, దేశభక్తి నినాదాలతో కొనసాగిన ఈ ర్యాలీలో యువత భారీగా పాల్గొన్నారు. జవాన్ల త్యాగాలను గుర్తు చేస్తూ పత్రలపై సందేశాలతో ప్రజల్లో దేశభక్తిని చాటే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బిజేవైఎం నాయకులు మాట్లాడుతూ, “కార్గిల్ యుద్ధం భారత యువతకు ప్రేరణగా నిలిచింది. దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు ఇది నివాళిగా చేస్తున్న కార్యక్రమం,” అని తెలిపారు.

ర్యాలీలో పాల్గొన్న యువత ‘భారత్ మాతా కీ జై’, ‘వందే మాతరం’ అంటూ నినాదాలు చేసి దేశభక్తి జలపాతంలా ఉప్పొంగించారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం గాంధీ బొమ్మ వద్ద మౌనప్రార్ధనతో వీరులకి శ్రద్ధాంజలి అర్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకశిరి ఫణి రాజు, కార్యదర్శి రత్నం నాయుడు, రిటైర్డ్ ఆర్మీ జవాన్లు, కుప్పా ప్రసన్న ముని పిడుగు లోకేష్, గంట విజయ్ శ్రీ చిలుకా ప్రవీణ్ , మస్తాన్ గౌడ్,కుమార్,ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రసాద్, మస్తాన్ ,సాంబశివారెడ్డి, మారం కృష్ణ, బట్టు రఘురామయ్య, వెంకటేష్ మాచిరాజు, మదన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed