*విమాన ప్రమాదం పై వేమిరెడ్డి దంపతుల దిగ్భ్రాంతి*

గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పై నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.

అహ్మదాబాద్ లోని మేఘాని నగర్ లోని BJ మెడికల్ కాలేజీ మెస్ పై విమానం కూలడం తో విమానం లోని ప్రయాణికుల తో పాటు మెస్ లోన మెడికోలు మరణించడం తీవ్ర దిగ్బ్రాంతి కి గురిచేసిందన్నారు. 242 మంది తమ ప్రాణాలు కోల్పోవడం కలచి వేసిందని చెప్పారు. ఘటన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కుటుంబాలకు అండగా ఉంటాయని వెల్లడించారు, అదే విధంగా క్షతగాత్రులకి వెంటనే సరైన వైద్య సదుపాయం అందాలని కోరారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆ బాధిత కుటుంబాలకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *