*మహానాడు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు – ఎంపీ వేమిరెడ్డి*
కడపలో మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమములో పాల్గొని, విజయవంతం చేసిన జిల్లా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
కడపలో ఈ నెల 27, 28, 29 మూడు రోజుల పాటు నిర్వహించిన మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా ముగిసిందని, ప్రత్యేకించి మహానాడులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి జాతీయ అధ్యక్షులుగా ఎన్నిక కావడం సంతోషకర విషయం అన్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకు ఉన్న విలువను ఈ మహానాడు ప్రస్ఫుటం చేసిందన్నారు. యువనేత, మంత్రి నారా లోకేష్ బాబు చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుందని, భవిష్యత్తుకు భరోసా కల్పించే దిశగా నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు గొప్ప సలహాలు, సూచనలను అందజేశారన్నారు.
ఈ మహానాడులో తొలిసారి ఎంపీగా పాల్గొనడం ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే స్పూర్తితో ముందుకు సాగుతామన్నారు. మహానాడు నిర్వహణలో ఎందరో నేతలు కీలకంగా వ్యవహరించారని, ప్రతి ఒక్కరి కష్టంతో మహానాడు విజయవంతం అయ్యిందన్నారు.
రవాణా దగ్గర నుంచి భోజనాల వరకు అన్ని విభాగాలు కలిసి పనిచేయడం తోనే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. పార్టీ అధినేత ఆదేశాలను అమలు చేస్తూ ముందుకు సాగుతామని, ప్రభుత్వానికి, పార్టీకి మరింత మంచి పేరు తెచ్చేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.