*కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. డైవర్షన్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్ : యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున.*
—————————————-
నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్సిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడారు..

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం.. వైయస్ఆర్సీపీ నేతలపై వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నలుపు వస్త్రాలు ధరించి.. చేతికి నల్ల వస్త్రాలను సంకెళ్లుగా వేసుకుని .. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం.. ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి నేతలపై.. అక్రమ కేసులు బనయిస్తుండడం.. దుర్మార్గమని చాటారు.

*ఊటుకూరు నాగార్జున* కామెంట్స్..

👉 ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికొదిలేసి.. ప్రతిపక్ష పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ.. పైశాచిక ఆనందం పొందుతుందన్నారు.

👉 నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు,మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిపై.. పెట్టిన అక్రమ కేసు అందుకు నిదర్శనమేనన్నారు.

👉 ఏడాదిలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను.. వారి ఆకృత్యాలను.. ప్రజలకు తెలియజేసినందుకే.. గోవర్ధన్ రెడ్డి గారిపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు.

👉 కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడంతో.. కూటమి నేతలు ఏదో ఘనకార్యం చేసినట్లు జబ్బలు చేరుచుకుంటున్నారని అన్నారు.

👉 ఈరోజు నెల్లూరు జిల్లాలోనే కాదు యావత్ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. ప్రతిపక్ష పార్టీ నేతలపై వారు పెడుతున్న అక్రమ కేసులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

👉 నెల్లూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు.. ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించారని తెలిపారు.

👉 మంత్రి గా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ప్రజల కోసం పరితపిస్తున్న నాయకుడిగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ..ఆయన ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడని కొనియాడారు.

👉 అలాంటిది ఈరోజు అధికార పార్టీ తీరును ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తున్నారన్న కారణంతోనే ఆయనపై అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారని ఆరోపించారు.

👉 గతంలో ఎంతో మంది నెల్లూరు జిల్లాలో రాజకీయాలు నడిపిన..ఎంతో హుందాగా నడిపారని ఇలా వ్యక్తిగత స్వార్థాలకు రాజకీయాలను ఉపయోగించుకున్న వారు లేరన్నారు.

👉 ఈరోజు జిల్లాలో ఎక్కడా లేనటువంటి సంస్కృతిని కూటమి ప్రభుత్వ నాయకులు..అమలు చేస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.

👉 ప్రజలు వారి తీరును అసహ్యించుకుంటున్నారని అన్నారు.

👉 ఈరోజు అక్రమ కేసులు పెడుతూ.. వైఎస్సార్సీపీ నేతలను.. అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేయడమేనన్నారు.

👉 మీరు ఈ రోజు ఎన్ని అక్రమ కేసులు పెట్టిన.. మా నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు..ఇచ్చిన భరోసాతో.. ఇలా ముందుకు పోతూ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును.. పత్రిక ముఖంగా ఎండగడతామన్నారు.

👉 అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న..తీరును ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలను కూడా చేపడుతున్నామన్నారు.

👉 రేపటి రోజున మా ప్రభుత్వం వస్తే…మీరు ఇబ్బంది పెట్టినట్టుగా.. మేము వ్యవహరిస్తే.. తెలుగుదేశం పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి చెప్పుకోవడం కాదు కదా కనీసం రోడ్ల మీదకు వచ్చి తిరగలేరన్నారు.

👉 ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పెడుతున్న అక్రమ కేసులు చూస్తుంటే సర్వేపల్లి లోని తెలుగుదేశం పార్టీ నేతలే ఉలిక్కిపడుతున్నారని.. రేపు వైసీపీ ప్రభుత్వం వస్తే మా పరిస్థితి ఏంటా అన్న సందిగ్ధం వారిలో నెలకొందన్నారు.

👉 న్యాయవ్యవస్థ పై తమకు నమ్మకం ఉందని.. మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు ఎలాంటి తప్పు చేయలేదని.. ఈ కేసు నుంచి క్లీన్ చిట్ తో బయటపడతారని ధీమా వ్యక్తం చేశారు.

👉 క్లీన్ చిట్ తో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు బయటకు వచ్చిన రోజు.. గర్జించే గళంతో.. కూటమి ప్రభుత్వ తీరును ఎండగడతారని తెలిపారు.

👉 ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు.. అమలు చేసే వరకు రాబోయే రోజుల్లో మా నాయకులు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి సూచనలతో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

👉 ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్టు చేసిన నాటి నుంచి వారి కుటుంబానికి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఏ విధంగా అండగా నిలుస్తున్న.. తీరు చూస్తేనే ప్రజలకు కార్యకర్తలకు ఆయన ఎలాంటి సేవలు అందించారో అర్థమవుతుందన్నారు.

👉 ఇది అక్రమ కేసు అనేందుకు ఉదాహరనే ఈరోజు తెలుగుదేశం పార్టీలో.. ఒకరైన ఈ అరెస్టును గురించి.. సమర్థించక.. పోవడమేనన్నారు.

👉 ఈరోజు కూటమి ప్రభుత్వ.. అక్రమ అరెస్టులకు.. బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.

👉 అరెస్టులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు భయపడరని.. మరింత ఉధృతంగా ప్రజల్లోకి వెళ్లి.. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతారని తెలిపారు.

ఈ సమావేశంలో వైఎస్ఆర్సిపి యువజన విభాగం నాయకులు చీదెళ్ల కిషన్, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, వైసిపి నాయకులు వెంకటేష్, మీరా, కిషోర్, మస్తాన్, దీపు, మనోజ్, సుమధర్, లోకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed