తమిళనాడు సీఎం స్టాలిన్ ను చూసి నేర్చుకోవాలని ఏపీ సీఎం కి హితువు# ….ఆర్ పి ఐ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ కే మాబు…

… ఆంధ్ర రాష్ట్రంలో . ఎం డి యు. వ్యవస్థ రేషన్ సప్లై చేసే వాహనాలను ఆపివేయడాన్ని వ్యతిరేకిస్తూ బోసుబొమ్మ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఆ ర్యాలీలో పాల్గొన్న ఆర్ పి ఐ పార్టీ జిల్లా అధ్యక్షులు. ఎస్ కే. మాబు .ఎం డి యు నేతలు కలెక్టర్ గారికి వినతి పత్రం అందించారు

అనంతరం. ఈ సందర్భంగా పాత్రికేయులతో ఎస్.కె మాబు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో పేదలకు .ఎం డి యు.వ్యవస్థ ఇంటింటికి రేషన్ సప్లై చేసే వాహనాలను నిలిపివేయడం దారుణమని అన్నారు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నిరుపేదలకు ముసలి ముతక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు మరియు రేషన్ సప్లై చేసే వాహనదారుల 18500 ల కుటుంబాలు రోడ్డున పడుతాయని అన్నారు

కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని. రేషన్ వాహనదారులకు 2027 వరకు ఇచ్చిన అగ్రిమెంటును యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే..పేదలకు రేషన్ సప్లై చేసే వాహనదారుల 18500 కుటుంబాలకు రాష్ట్రవ్యాప్తంగా అండగా నిలబడి పెద్ద ఎత్తున ఆర్ పి ఐ పార్టీ పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టపు రంగారావు ఉపాధ్యక్షులు కొత్తల మధుసూదన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నంబూరు గణేష్ కోవూరు సురేష్ ఆర్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు దక్కా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed