*29వ డివిజన్ గాంధీ నగర్ టీడీపీ నుండి వైసీపీలోకి భారీ చేరికలు*
*ఎన్నికలవేళ రూరల్ టీడీపీకి షాక్ మీద షాక్ లు : ఆదాల*
*వైసీపీలోకి 100 తెలుగుదేశం పార్టీ సానుభూతి కుటుంబాలు*
*29వ డివిజన్ లో దివాలా దిగిన టీడీపీ*
*పార్టీ సీనియర్ నాయకులు ఆనం జయకుమార్ రెడ్డి, జిల్లా ఈసీ మెంబర్ సీహెచ్ సూరిబాబు ఆధ్వర్యంలో చేరికలు*
*పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*
ఎన్నికలవేళ రూరల్ తెలుగుదేశం పార్టీకి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. రూరల్ నియోజకవర్గంలోని 29వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ గాంధీనగర్ ప్రాంతం నుండి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన 100 కుటుంబాల తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డితోనే సాధ్యమవుతుందని భావించి స్వచ్ఛందంగా వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ మేరకు మంగళవారం వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఆనం జయకుమార్ రెడ్డి, పార్టీ ఈసీ మెంబర్ సిహెచ్ సూరిబాబు తదితరుల ఆధ్వర్యంలో 29వ డివిజన్ కార్పొరేటర్ షేక్ సత్తార్, జెసిఎస్ కన్వీనర్ కొండా సాయి రెడ్డి, ఐటీ వింగ్ నాయకులు షేక్ జాకీర్ తదితరుల సహకారంతో గాంధీ నగర్ ప్రాంతానికి చెందిన 100 తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల కుటుంబాలవారు నెల్లూరు రూరల్ అభివృద్ధిని ఆకాంక్షించి స్వచ్ఛందంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల్లూరు రూరల్లో జరిగిన అభివృద్ధికి ఆకర్షితులై గాంధీనగర్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి కీలకంగా వ్యవహరించిన 100 కుటుంబాల వారు స్వచ్ఛందంగా ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభపరిణామం అని, వారందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. స్వచ్ఛందంగా టిడిపి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పార్టీలో సముచితమైన,గౌరవప్రదమైన ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని, అదేవిధంగా భవిష్యత్తులో వారందరికీ ఎటువంటి కష్టం వచ్చిన తాను అన్నివేళ అండగా ఉంటారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఐకమత్యంతో రూరల్లో వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచించారు. 29వ డివిజన్ గాంధీనగర్ నుండి తెలుగుదేశం పార్టీని వీడి స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో షేక్ రియాజ్, షేక్ ఖదీర్, లక్ష్మి, జానకి తదితరులతోపాటు వారి మిత్రబృంద సభ్యులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోటేశ్వర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ రావులపల్లి వెంకట జ్యోతి, రావుల అమర్నాథ్, 29వ డివిజన్ నాయకులు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.