శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
– జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో 1000 మందికి పైగా అన్నదానం
——–
శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు ప్రజలందరూ పై ఉండాలని జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా సోమవారం ఆయన 1000 పైగా అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా నూనె మల్లికార్జున మాట్లాడుతూ మంగళవారం కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. గత వందేళ్లుగా వంశపారపర్యంగా తన కుటుంబ సభ్యులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని రెండు రోజులు పాటు నిర్వహిస్తామని తెలిపారు.
ఆ ఆనవాయితీని నేను కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలకుండా అధికారులు చర్యలు చేపట్టారని అన్నారు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారని నూనె మల్లికార్జున యాదవ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నేత పెయ్యల పవన్, తాల్లూరి వెంకట్, బి జె పి నాయకులు హాజరత్, నిజాం శివ, చంటి, మహేష్, దినేష్ మరియు జనసేన నాయకులు వీరమహిళలు పాల్గొన్నారు.