*ఎంపీ వేమిరెడ్డి దంపతులను కలిసిన మెట్టుకూరు ధనుంజయ రెడ్డి*
నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీ మతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులను డిసిసిబి చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
సోమవారం నెల్లూరులోని విపిఆర్ నివాసానికి వచ్చిన ధనంజయ రెడ్డి ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి దంపతులను శాలువాతో సత్కరించారు.
డిసిసిబి పదవి రావడంపై వేమిరెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు.. ధనుంజయరెడ్డికు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎంపీతో భేటీ అయ్యి వివిధ అంశాలపై చర్చించారు.