*జర్నలిస్టులను అన్యాయంగా అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వినూత్న నిరసన ఆర్ పి ఐ*

……..,…….,

జర్నలిస్టులను అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపడాన్ని వ్యతిరేకిస్తూ విఆర్సి సెంటర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఆర్ పి ఐ నాయకులు చేతులకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు

ఈ సందర్భంగా ఆర్ పి ఐ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ కే మాబు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కావలి కి చెందిన విలేకరులను అరెస్టు చేసి జైలు పాలు చేయడం ప్రజల గొంతును నొక్కేయడమే నని అన్నారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని జర్నలిస్టుల మీద దాడులు చేయడం అక్రమ కేసులు పెట్టడం ఆనవాయితీగా మారిపోయిందన్నారు

జర్నలిస్టులు ఏ రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉండకూడదని ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజా ప్రభుత్వ ధనాన్ని సహజ వనరులను దోచుకోవడాన్ని ఎక్కడికక్కడ ఎండ కడుతూ అటు ప్రజలకు ఇటు ప్రభుత్వ అధికారులకు తెలియచేసే విధంగా ఉండాలన్నారు

జర్నలిస్టులు ఎక్కడ ఏమి సంఘటనలు జరిగిన వాళ్ళ ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ వాస్తవాలు తెలుసుకుంటారే తప్ప ఆ సంఘటనలకు వారికి ఏం సంబంధం ఉంటుందన్నారు కావలి కి చెందిన విలేకరుల అరెస్టు ముమ్మాటికి రాజకీయ కక్షే నని అన్నారు

ప్రజా ప్రతినిధులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని జిల్లాలో ఎక్కడ కక్ష సాధింపులకు పాల్పడిన అక్కడ ఆర్ పి ఐ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు నిరసనలు తెలియచేస్తుందని అన్నారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరికొండ సురేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టపు రంగారావు జిల్లా ఉపాధ్యక్షులు దుంపల సుబ్బారావు బత్తల మధుసూదన్. జిల్లా కార్యదర్శి వజ్జా సుధాకర్ .దాసరి దుర్గాప్రసాద్. హరి నిమ్మల సుబ్బయ్య. కంచి అశోక్. అచిత్. రాజా. యూత్ జిల్లా అధ్యక్షులు ముసలి జయరాజ్ ప్రశాంత్ ఎస్.కె బాబు మీడియా ఇంచార్జ్ బెల్లంకొండ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed