*ఆనాడు అధికారం ఉందని విర్రవీగిన తాడేపల్లి క్లర్క్..ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నాడు*

*సజ్జల భూకబ్జా పర్వంపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్*

గత ప్రభుత్వంలో ఐదేళ్లూ బ్లూ మీడియాను పార్టీ ఆఫీసుకు పిలిపించుకుని ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చిన సజ్జల నోరు నేడెందుకు మూగబోయింది.

నాడు చంద్రబాబు నాయుడుపైనా, నాటి ప్రతిపక్ష పార్టీల ప్రజా పోరాటాలపైనా నీతి మాలిన వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి…64 ఎకరాల అటవీ, ఎసైన్డ్ భూముల కబ్జాపై సమాజానికి సమాధానం చెప్పి తీరాలి.

అధికారం ఉన్నప్పుడు ఎగిరిపడిన ఆ తాడేపల్లి క్లర్క్…తప్పులు, నేరాలు,ఘోరాలు చేశాడు కాబట్టే నేడు కలుగులో దాక్కున్నాడు.

అటవీ భూమలు మింగేసిన సజ్జలపై కూటమి ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed