*ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ*..
*ఇండియన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్న షర్మిల పై పోలీసులు కేసు నమోదు చేయాలని బిజెపి నేత మిడతల రమేష్ డిమాండ్*
ఐదు రోజుల క్రితం విజయవాడలో మీడియా ముందు ఆంధ్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల కేంద్ర ప్రభుత్వంపై విద్వేష కుట్రపూరితమైన వ్యాఖ్యలు చేశారు.
పహాల్గంలో జరిగిన ఉగ్రదాడి లో మతం లేదని… దేశం లోపల మతం పేరుతో యుద్ధం జరుగుతుందని వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశ ఇంటర్నల్ టెర్రరిస్టూ. ఇండియన్ ఇంటెలిజెన్స్ తో పాటు వ్యవస్థలన్నీ మోడీ కోసమే పనిచేస్తున్నాయని తమ వక్రబుద్ధిని షర్మిల బయటపెట్టారు
పహాల్గం లో పాక్ తీవ్రవాదుల మారణకాండ కు మోడీ అమిత్‌షాలే బాధ్యులు. వీరిద్దరూ తక్షణం రాజీనామా చేయాలని షర్మిల చేసిన వ్యాఖ్యలు పై ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేయాలని రమేష్ డిమాండ్ చేశారు
షర్మిల వ్యాఖ్యలు పాక్ తీవ్రవాదాన్ని సమర్థించేలా ఉన్నాయి. ఉగ్ర దాడి అనంతరం శత్రుదేశానికి మనకు యుద్ధ వాతావరణం నెలకొంటూ ఉంది. ఈ పరిస్థితుల్లో దేశానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు షర్మిల కుట్ర పన్నుతున్నారని ఆందోళన చెందుతున్నము.
భారత ప్రభుత్వం ఉగ్ర మూకలను అంతమొందించే వరకు దేశ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనే వరకు షర్మిలాను అరెస్టు చేసి జనావాసాలకు దూరంగా ఉంచాలని రమేష్ డిమాండ్ చేశారు.
యుద్ధ వాతావరణ సమయంలో దేశ ప్రధానిని ఇంటర్నల్ టెర్రరిస్ట్ గా పేర్కొనడం పై ఎన్ఐఏ షర్మిలను విచారించాల్సిన అవసరం ఉందని రమేష్ కేంద్ర నిఘా సమస్యలకు ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.