*జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం — వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*
*ప్రజలకు మేలు చేకూర్చే జగనన్న నవరత్నాల ప్లస్ మేనిఫెస్టో — ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*
*ఇచ్చినమాటకు కట్టుబడి చెప్పాడంటే చేస్తాడంతే — వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*
*చంద్రబాబులాగ మోసపూరిత హామీలు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డికి చేతకాదు — వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*
*కోలాహలంగా మారిన కొమ్మరిపూడి, ములుముడి*
*జిల్లా పరిషత్ పర్సన్ ఆనం అరుణమ్మతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం*
*వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఘనస్వాగతం కొమ్మరిపూడి, ములుముడి గ్రామస్తులు*
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం అనే విధంగా మరోసారి నవరత్నాల ప్లస్ మేనిఫెస్టో ద్వారా మరోసారి నిరూపించారని నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆయన నెల్లూరు రూరల్ మండలంలోని కొమ్మరపూడి, ములుముడి గ్రామాల్లో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమానికి స్వచ్ఛందంగా హాజరైన గ్రామస్తులు ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన నవరత్నాల ప్లస్ మేనిఫెస్టో ప్రజలకు అదనపు ప్రయోజనకరాన్ని చేకూర్చే విధంగా ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం 3000 రూపాయలు ఇస్తున్న పింఛన్ ను రూ. 3500లకు పెంచడం జరిగిందని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల చెప్పారు. *చంద్రబాబు నాయుడు వలె సాధ్యముకాని హామీలు ఇచ్చి తీరా ప్రజలు ఎంతో ఆశతో అధికారం కట్టబెడితే అధికారంలో వచ్చిన మరుసటి రోజు నుంచి ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదని* ఏవైతే ప్రజలకు మేలు చేస్తాయో… ఆ పథకాలన్నీ ఎంతవరకైతే మధ్యలో ఆగిపోకుండా ప్రజలకు మేలు చేకూరే విధంగా కొనసాగిస్తామో వాటిని మాత్రమే ప్రజలకు వాస్తవా రూపంలో ఎన్నికల ప్రచార మేనిఫెస్టోలో తెలియజేయడం జరిగిందని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం కొనసాగేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు యధావిధిగా కొనసాగిస్తూ రానున్న ఐదు సంవత్సరాలలో మరింత అదనపు ప్రయోజనం చేకూరా విధంగా మ్యానిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయడం జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. నెల్లూరు రూరల్ మండలంలోని కొమ్మరిపూడి, ములుముడి గ్రామాలు జాతర వాతావరణంలో కోలాహలంగా మారాయి. నెల్లూరు రూరల్ వైసీసీ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి ముందుగా శనివారం సాయంత్రం కొమ్మరిపూడి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి కొమ్మరపూడి, ములుముడి గ్రామాల వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. కొమ్మరపూడి, ములుముడి గ్రామంలోని ప్రతి వీధిలో ఓపెన్ టాప్ జీపుపై నుండి గ్రామస్తులకు రెండు చేతుల జోడించి నమస్కరిస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మతో కలిసి నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు, పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయ సాయిరెడ్డికి ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మలిరెడ్డి కోటారెడ్డి, రాష్ట్ర సేవ దళ్ అధ్యక్షులు మాలెం సుధీర్ కుమార్ రెడ్డి, కొమ్మరపుడి గ్రామ వైయస్ఆర్సీపీ నాయకులు నెట్టెం శ్రీధర్ నాయుడు, వల్లభనేని రమణమ్మ, కాకి మనోహర్, దొడ్ల మస్తానయ్య, సీనయ్య, బండి శ్రీనివాసులు, బాలు పెంచలయ్య, షేక్ మస్తానయ్య, దండి మురళీ పుండా మస్తానయ్య, తాడిపర్తి గోపి, పాదర్తి పెంచలయ్య, ఎంపీపీ బూడిద విజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు పుచ్చలపల్లి రాంప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకు మల్లు సుధాకర్ రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లంక రామశివారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు స్వర్ణ వెంకయ్య, బద్దేపూడి రవీంద్ర, ఉదయగిరి నరసింహులు గౌడ్, వేమిరెడ్డి అశోక్ రెడ్డి, వేమిరెడ్డి హరిశివారెడ్డి, వేమిరెడ్డి హరికృష్ణ రెడ్డి, షేక్ జిలాని, టి శ్రీనివాసులు, వేమిరెడ్డి ధీరజ్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యురాలు సయ్యద్ మొబినా, పార్టీ నాయకులు బెల్లంకొండ వెంకయ్య, పల్లాల శ్రీనివాసులు, మాదా బాబు, మణి యాదవ్, కరీముల్లా, కొమ్మరపూడి, ములుముడి గ్రామాల వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు