*నెల్లూరులో బాలయ్యకి బ్రహ్మరథం…*
– భారీ గజమాలతో ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు
– అడుగడుగునా పూల వర్షం
– జై బాలయ్య…జై జై బాలయ్య అంటూ హోరెత్తిన నినాదాలు
– నవాబుపేట నుంచి గాంధీబొమ్మ వరకు బాలయ్య రోడ్ షో అదుర్స్
– పాల్గొన్న వేమిరెడ్డి, నారాయణ, అజీజ్, కోటంరెడ్డి, శ్రీనివాసులు, టీడీపీ ముఖ్య నేతలు
స్వర్ణాంధ్ర సాధికార యాత్రలో… ప్రముఖ సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ శుక్రవారం రాత్రి నెల్లూరుకు విచ్చేశారు.
ఈ సందర్భంగా…బాలకృష్ణకు నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం… నవాబుపేట సెంటర్ నుంచి…గాంధీబొమ్మ సెంటర్ వరకు బాలకృష్ణ భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ యాత్రకి వేలాదిగా తరలి వచ్చి…బాలయ్యకి బ్రహ్మరథం పట్టారు. రోడ్ షోలో బాలయ్య పాల్గొని…ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బాలకృష్ణకు అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ… భారీ గజమాలతో సత్కరించారు. జై…బాలయ్య…జై జై బాలయ్య అంటూ నినాదాలు హోరెత్తించారు. వేలాది మంది తరలి రావడంతో… నెల్లూరు నగరం పసుపుమయమైపోయింది..