*శ్రీకాళహస్తీశ్వరాలయ పైకప్పు పునరుద్ధరణ సక్సెస్ : తిరుపతి ఎంపీ గురుమూర్తి*
శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ పైకప్పునకు నిర్వహించిన పునరుద్ధరణ పనులు సంప్రదాయ పద్ధతుల్లో విజయవంతంగా పూర్తయ్యాయి. .
A60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పునరుద్ధరణ పనులను చేపట్టారు. ప్రత్యేకంగా వర్షపు నీటి లీకేజీని నివారించేందుకు ప్రాచీన, పర్యావరణహిత పద్ధతులలో పనులను చేపట్టారు
తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి విజ్ఞప్తి మేరకు పూఆఆణే వెంకటేశ్వర హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత బి.వెంకటేశ్వరరావు రూ.5 కోట్లఆ వ్యయంతో ఈ పనులను చేపట్టారు.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ఆలయ దైవ సంప్రదాయాలను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించిందని, సుమారు 500 సంవత్సరాలు మన్నిక ఉంటుందని ఎంపీ తెలిపారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామి భక్తుల తరఫున శ్రీ బి.వెంకటేశ్వరరావు గారికి, వారి బృందానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అదే విధంగా ఈ మహత్తర కార్యానికి మద్దతు అందించిన ఎపిగ్రఫీ డైరెక్టర్ డా.కె. మునిరత్నం రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.