పారా మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవం
.
గ్రామీణ ప్రాంతాల్లో సి పి ఎం డబ్ల్యూ ఏ సేవలు ప్రశంసనీయం
– షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు.
నెల్లూరు నగరంలోని అభిరామ్ హోటల్ నందు కమ్యూనిటీ పారామెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి 8 వ వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ నెల్లూరు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఖాజామియ్యా సభా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, కొన్నేళ్ల కిందట గ్రామాల్లో ఎటువంటి మెరుగైన కార్యాలు లేని సమయంలో వీరు గ్రామాల్లో వైద్య సేవలు అందించారని తెలిపారు. 2017 లో గ్రామీణ వైద్య సేవకులు గా ఒక ప్రణాళికబద్ధంగా గుర్తింపు ఇవ్వాలన్న ఆలోచనతో టిడిపి ప్రభుత్వం జీవోను విడుదల చేసిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే గుర్తింపు ఇస్తానని చెప్పి మాట తప్పి టిడిపి ప్రభుత్వం ఇచ్చిన జీవోను విస్మరించిందని అన్నారు. గ్రామీణ వైద్య సేవకులుగా గుర్తింపు ఇవ్వాలని వీరు కోరుతున్నారని తెలిపారు. వీరు చేస్తున్న సేవలకు గుర్తింపు ఇవ్వాలన్నా చట్టబద్ధత తేవాలన్నా ఒక ప్రణాళిక అవసరమని అన్నారు. ఏ ప్రతిపాదికన వీళ్ళకి గుర్తింపు ఇవ్వాలో వీరినే ప్రణాళిక రూపొందించమని అడిగామని అన్నారు. తద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి వీరికి గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో డా. సిరాజ్, భాను కిరణ్, చాన్ బాషా, ఖాజా మొహిద్దిన్ తదితరులు పాల్గొన్నారు.