_*వి ఎస్ యూ పరిశోధన అభివృద్ధికి కేంద్ర భూవిజ్ఞాన శాఖ మద్దతు…*_
…..
విక్రమ సింహపురి యూనివర్శిటీ (వీఎస్‌యూ) వైస్ చాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు భారత ప్రభుత్వ భూవిజ్ఞాన శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం. రవిచంద్రన్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో వర్సిటీ అకడమిక్, పరిశోధన, ఇన్నోవేషన్ మరియు భూవిజ్ఞాన రంగంలో సంయుక్త పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తూ చర్చలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విక్రమ సింహపురి యూనివర్శిటీ విద్యార్థులకు మరింత పరిశోధనా అవకాశాలను కల్పించేందుకు కేంద్ర భూవిజ్ఞాన శాఖ సహకారాన్ని కోరారు. డాక్టర్ ఎం. రవిచంద్రన్ గారు వీఎస్‌యూ కి కావాల్సిన సహాయ సహకారాలను అందించేందుకు సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో భూవిజ్ఞాన మరియు సముద్ర అధ్యయన రంగాలలో వీఎస్‌యూ తో భాగస్వామ్యం పలు ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు.
సంయుక్త సహకార కార్యక్రమం లో భాగంగా పరిశోధన ప్రాజెక్టులు, అధునాతన ప్రయోగశాల సౌకర్యాల కల్పన, శాస్త్రీయ సమావేశాలు, వర్క్‌షాప్‌లు నిర్వహణ మరియు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను వీఎస్‌యూ మరియు భూవిజ్ఞాన శాఖ సంయుక్తంగా ప్రతిపాదనలు చేయడం జరిగింది.