_*వి ఎస్ యూ లో జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలు…*_
……………..
కాకుటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ప్రాగాణంలోని సర్ సి.వి. రామన్ సెమినార్ హాల్ లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ “వికసిత భారత్ కోసం గ్లోబల్ లీడర్షిప్‌లో భారత యువతను శక్తివంతం చేయడం” అనే అంశంపై ప్రసంగించారు. భారత యువత సాంకేతికత, విజ్ఞానం, మరియు నూతన ఆవిష్కరణల ద్వారా ప్రపంచ స్థాయిలో నాయకత్వ స్థానాన్ని ఎలా అలంకరించగలరు అనే విషయాన్ని వివరించారు.
కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచేసిన డా. ఎస్. సోమేశ్వరరావు, స్పెషల్ సెంటర్ ఫర్ మాలిక్యులర్ మెడిసిన్, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ, మాట్లాడుతూ ఆధునిక విజ్ఞానం, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ మెడిసిన్ అభివృద్ధిలో భారతదేశం ప్రపంచంలో ముందుండేందుకు అవసరమైన చర్యలు గురించి వివరించారు. యువత శాస్త్రసాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలను అభివృద్ధి చేయడం ద్వారా దేశ ప్రగతికి దోహదపడాలని సూచించారు.
అలాగే, డా. కె. రాజేంద్ర, శాస్త్రవేత్త, ఐ ఐ ఎస్ ఇ ఆర్, తిరువనంతపురం, మాట్లాడుతూ సైన్స్ & టెక్నాలజీ రంగంలో భారత యువతకు అందుబాటులో ఉన్న అవకాశాలు, కొత్త పరిశోధనల వలన సమాజంపై చూపే ప్రభావం వంటి అంశాలను వివరించారు. భారతదేశం వైజ్ఞానిక రంగంలో స్వయంసమృద్ధిగా మారేందుకు యువత పాత్ర ఎంతో కీలకం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ యం.హనుమారెడ్డి, కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా ఆచార్య జి విజయ ఆనంద్ కుమార్ బాబు ,ఆర్గనైజర్స్ గా డాక్టర్ ఎ.శివశంకర్ రెడ్డి,డాక్టర్ జి.మేరీ సందీప,డాక్టర్ పి. త్రివేణి, అధ్యాపకులు, అధ్యపకేతరసిబ్బంది మరియు విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొనారు.
