*జనసేన పార్టీ,మెడికవర్ మరియు కార్తికేయ డెంటల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్*
గుర్రాల మడుగు సంఘం,16 డివిజన్ నెల్లూరు సిటీ.
నెల్లూరు సిటీ 28 డివిజన్లో జనసేన పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే భాగంగా జిల్లా పర్యవేక్షకులు ఏపి టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో గునుకుల కిషోర్ గారి సతీమణి విజయలక్ష్మి ఆధ్వర్యంలో 16 డివిజన్,గుర్రాల మడుగు సంఘంలో మెడికల్ క్యాంపు నిర్వహించి ఈసీజీ;పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వటం జరిగింది…
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
డివిజన్లో మెడికల్ క్యాంపు నిర్వహించేందుకు కృషి చేసిన గునుకుల విజయలక్ష్మి మరియు పదహారో డివిజన్ నాయకులు నరహరి,వెంకటరమణ,డాక్టర్లకు మరియు మెడికల్ సిబ్బందికి అభినందనలు…
జనసేన పార్టీ సమస్యలను ప్రశ్నిస్తూ ప్రజలకు చేరువ అయింది.ఇప్పటివరకు అభివృద్ధిని ప్రశ్నించిన జనసేన పార్టీ ప్రజలకు సేవలను అభివృద్ధిని అందించడంలో ముందడుగు వేస్తుంది… నిన్న నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల మంత్రి గా విద్యార్థులకు అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత మధ్యాహ్న భోజన పథకం కింద సన్న బియ్యం సరఫరా చేయిస్తూ నాణ్యమైన సరుకులు పౌరులకు అందే విధంగా జరిగిన కార్యక్రమానికి సహకరించిన మీడియా మిత్రులకు మరియు అధికారులకు అభినందనలు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల బీమా వర్తింపజేసేటట్టు రానున్న ఆర్థిక సంవత్సరంలో బిల్లును ప్రవేశపెట్టనున్నారని ప్రజా రంజకమైన సాగిస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు…
ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమమే ఆశయంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కోలుకుని ప్రజాక్షేత్రం లో మరిన్ని సేవలు సాగించాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా పర్యవేక్షకులు సీనియర్ నాయకులు మల్లికార్జున యాదవ్,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్ రామిరెడ్డి, కార్యాలయంఇన్ చార్జ్ జమీర్,సిటీ పర్యవేక్షకులు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,వారి సతీమణి విజయలక్ష్మి, నెల్లూరు రూరల్ పర్యవేక్షకులు చంద్రశేఖర్ రెడ్డి,జనసేన నాయకులు మురళీకృష్ణ, కృష్ణ పెన్న జిల్లాల కోఆర్డినేటర్లు విజయలక్ష్మి,నాగరత్నం, హైమావతి,రేవతి, గజరాజు శాంతి కల,శాంభవి,జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి,డివిజన్ నాయకులు నరహరి, వెంకటరమణ,యాసిన్,అబీద్,శ్రీకాంత్,హుస్సేన్,వెంకీ, వసీం,కిషోర్, తదితరులు పాల్గొన్నారు.