*దాతృత్వం చాటుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి*
* శివరాత్రి సందర్భంగా మహిళా భక్తులకు “వాయనం” వితరణ
శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాలలో పాల్గొనే మహిళా భక్తులకు
కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యురాలువేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పసుపు, కుంకుమ, రవిక, గాజులు, పసుపు దారం వితరణగా ఇస్తామని ప్రకటించారు.
సనాతన సాంప్రదాయాన్ని పాటిస్తూ ముక్కంటేశ్వరుడి సన్నిధికి వచ్చే వేలాది మహిళా భక్తులకు “వాయనం” అందించేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి దాతృత్వాన్ని మహిళా భక్తజనంతో పాటు ఆలయ పాలకవర్గంప్రశంసించారు.