*ఢిల్లీ ముఖ్యమంత్రిగా తొలిసారి బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం*
ఢిల్లీ ముఖ్యమంత్రిగా తొలిసారి బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
దీంతో ఢిల్లీకి బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్, కాంగ్రెస్‌కు చెందిన షీలా దీక్షిత్, ఆప్‌కి చెందిన అతిషి తర్వాత నాలుగో మహిళా సీఎం అయ్యారు.
*ఇక రేఖా గుప్తా జీవిత చరిత్ర విషయానికి వస్తే*
రేఖ గుప్తా రాజకీయ ప్రయాణం
1992లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరారు.
1995-96లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (DUSU) కార్యదర్శి అయ్యారు.
1996-97లో DUSU అధ్యక్షురాలయ్యారు.
2007లో ఉత్తర పితంపుర నుండి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.
2010లో BJP జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలయ్యారు.
2022లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) మేయర్ పదవికి BJP అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
2025లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నుండి MLAగా ఎన్నికయ్యారు.
రేఖ గుప్తా తండ్రి గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్.
ఆమె కుటుంబం 1976లో ఢిల్లీకి మకాం మార్చింది. రేఖ గుప్తా తన మొత్తం విద్యను ఢిల్లీలో పూర్తి చేసింది.
ఈ సమయంలో ఆమె ABVP (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్)లో చేరి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
ప్రస్తుతం రేఖ గుప్తా పేరు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చనీయాంశమవుతోంది.
ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా దివంగత & మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ (ఒకప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా) తర్వాత బిజెపి నుండి రెండవ మహిళా ముఖ్యమంత్రి రేఖ గుప్తా.
రేఖ గుప్తా 1974లో జింద్ జిల్లాలోని జులానా ఉపవిభాగంలోని నంద్‌గఢ్ గ్రామంలో జన్మించారు..