ఒక్క
*ఒక్క రాయి పెట్టకుండానే రూ.1.28 కోట్లు స్వాహా*
*జగనన్న కాలనీల పేరిట సర్వేపల్లి వ్యాప్తంగా భారీగా దోపిడీ*
*పేదలను చెట్లకు, పుట్లకు వదిలేసి కాకాణి మాత్రం కరోనా హౌస్ లో కులుకుతున్నాడు*
*ఎగువమిట్టలో గిరిజనుల పరిస్థితి చలించిపోయిన టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*టీడీపీ అధికారంలోకి రాగానే గిరిజనులకు నాణ్యతతో కూడిన ఇళ్లు కట్టిస్తామని హామీ*
*పేదలకు ఇళ్ల పేరిట కాకాణి అండ్ బ్యాచ్ చేసిన దోపిడీపై సిట్ తో విచారణ జరిపించి ప్రతి రూపాయి కక్కిస్తాం*
*వెంకటాచలం మండలం ఎగువమిట్టలో మీడియాతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
ఎగువమిట్టలో 68 మంది గిరిజనుల ఇళ్ల కోసం రూ.1.28 లక్షల చొప్పున డ్రా చేసినట్లు సచివాలయంలో బోర్డు పెట్టారు
కాలనీని సందర్శిస్తే మట్టి, రాళ్లు తప్పితే కట్టుబడి లేదు
రూ.1.28 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో అర్థం కాని పరిస్థితి
లెవలింగ్ చేయాల్సిన అవసరం లేకపోయినా చేసినట్లు చూపించి భోంచేశారు
ఎకరా రూ.15 లక్షలకు కొనుగోలు చేస్తే రూ.40లక్షలకు కొనుగోలు చేసినట్లు చూపారు. ఆ మార్జిన్ డబ్బులు కాకాణి అండ్ బ్యాచ్ తినేసింది
తోటపల్లి గూడూరు మండలం వరిగొండలో గిరిజనుల ఇళ్లు కడతామని రూ.2.60 కోట్లు స్వాహా చేశారు.
మనుబోలు మండలం వీరంపల్లిలో పెద్దరెడ్లమని చెప్పుకునే వైసీపీ నాయకులు ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం కట్టిన ఇళ్లను ఇప్పుడు కట్టినట్టుగా చూపి ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు డ్రా చేసేశారు
వారం రోజుల్లోనే ఒక రోజు గోడకాళ్లు తీసినట్లు, మరుసటి రోజు బేస్మెంట్లు వేసినట్లు, రెండు రోజుల్లో లెంటిల్ లెవల్ కట్టినట్లు, వారం రోజులకు శ్లాబ్ వేసి ఫినిషింగ్ చేసినట్లు చూపి పేమెంట్లు చేసుకున్నారు.
అదే క్రమంలో టీడీపీ సానుభూతి పరులు 2019 ఎన్నికల నాటికి సగం నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లపై మాత్రం కక్షకట్టి వదిలేశారు.
ఆ పేదలు మాత్రం ఐదేళ్లుగా చెట్ల కింద గడుపుతున్నారు
పేదలను అలా చెట్లకు, పుట్లకు వదిలేసి మన రెడ్డి గారి మాత్రం కరోనా హౌస్ లో కులుకుతూ కూర్చోవడం న్యాయమా
మొత్తంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని దుర్మార్గాలకు మార్చిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమైపోయారు
పేదల ఇళ్ల పేరిట కుంభకోణాలకు పాల్పడిన కాకాణి అండ్ బ్యాచ్ ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ప్రతి రూపాయి కక్కిస్తాం