*ఘనంగా కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలల వార్షికోత్సవ వేడుకలు..*

నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలల (జూనియర్స్ ) యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కృష్ణ చైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకులు మరియు చైర్మన్ *డాక్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి* గారు, విద్యాసంస్థల *డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి* గార్ల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి..

ఈ కార్యక్రమానికి *విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ విజయ భాస్కరరావు, మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు.. ముఖ్య అతిథులుగా హాజరయ్యారు… ఈ సందర్భంగా అతిథులను.. కళాశాల ప్రతినిధులు.. ఘనంగా సన్మానించారు.

అకాడమిక్ పరీక్షల్లో.. రాణించిన విద్యార్థులకు.. అతిధులు.. మొమెంటోలు అందజేసి సత్కరించారు.

• *ఈరోజు తమ కళాశాలల వార్షికోత్సవ వేడుకలకు.. వి ఎస్ యు వైస్ ఛాన్స్ లర్ విజయభాస్కరరావు, సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ గారు, విచ్చేయడం ఎంతో సంతోషకరమని విద్యాసంస్థల ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి గారు తెలిపారు.*

• *కృష్ణ చైతన్య విద్యాసంస్థల.. దినాఅభివృద్ధికి.. విక్రమ సింహపురి యూనివర్సిటీ.. అందిస్తున్న సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.*

• *అతిథులు అందించిన విలువైన.. సూచనలు.. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.*

అనంతరం విద్యార్థులు ఆటపాటలతో అలరించారు.. విద్యార్థుల డాన్సులు.. ఎంతగానో ఆలోచించాయి

ఈ సందర్భంగా వి ఎస్ యూ వైస్ ఛాన్స్ లర్ విజయ భాస్కర్ రావు గారు మాట్లాడుతూ..

👉 *విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి తల్లిదండ్రులకు మంచి పేరు..తీసుకురావాలన్నారు*

👉 *యువత లక్ష్యాన్ని.. నిర్దేశించుకుని జీవితంలో ముందడుగు వేయాలన్నారు.*

👉 *లక్ష్యసాధన దిశగా ముందు అడుగు వేసేవారు.. ప్రణాళిక బద్ధంగా.. విద్యాభ్యాసాన్ని పూర్తి చేయాలని సూచించారు.*

👉 *రాబోయే రోజుల్లో విక్రమసింహపురి యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఫార్మసీ, ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని తెలిపారు.*

ఈ సందర్భంగా జెడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ..

👉 *ఎంతోమంది మహనీయులు.. పుట్టిన జిల్లా నెల్లూరు జిల్లా అని పేర్కొన్నారు .*

👉 *నెల్లూరు జిల్లా.. అమరజీవి పొట్టి శ్రీరాములు, తిక్కన సోమయాజులు, నడయాడిన నేల అని గుర్తు చేశారు*

👉 *ముఖ్యంగా ప్రతి ఒక్కరు పొట్టి శ్రీరాములు.. త్యాగాలను గుర్తించుకోవాలన్నారు.*

👉 *ప్రతి ఒక్కరూ వారి వారి వృత్తుల్లో.. దేశానికి సేవ చేస్తూ .. ప్రజలందరికీ స్ఫూర్తినిస్తున్నారని తెలిపారు*

👉 *ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులు.. ఇతను నా బిడ్డ అని చెప్పుకునే విధంగా ఎదగడం .. మనం చదువుకున్న పాఠశాల లేదా కళాశాలకు మనం అతిథిగా వెళ్లడం.. మన..సంతకాన్ని ఆటోగ్రాఫ్ లా . ఇతరులు తీసుకునేలా ఎదగడం.. ఈ మూడు లక్ష్యాలుగా విద్యార్థులు నిర్దేశించుకున్నట్లయితే .. వారు జీవితంలో తప్పక విజయం సాధిస్తారని తెలిపారు.*

👉 *విద్యార్థులు… సోషల్ మీడియాను అవసరం ఉన్నంత మేరకే వినియోగించుకుంటూ.. పుస్తక పట్టణాన్ని అలవర్చుకోవాలని తెలిపారు.*

👉 *ఏపీజే అబ్దుల్ కలాం గారు తనకు స్ఫూర్తినిచ్చిన మహనీయుడని పేర్కొన్నారు.*

👉 *విద్యార్థులు ప్రతి ఒక్కరు మహనీయుల.. చరిత్ర తెలుసుకొని.. వారి అడుగుజాడల్లో.. నడవాలన్నారు.*

ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ..

👉 *తమ కళాశాల వార్షికోత్సవ వేడుకలకు.. సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ గారు, వి ఎస్ యు వైస్ ఛాన్స్ లర్ విజయభాస్కర రావు గారు.. విచ్చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.*

👉 *విద్యార్థులకు అతిధులు ఇచ్చిన సందేశం.. ఎంతో విలువైనదని పేర్కొన్నారు.*

👉 *విద్యార్థులు .. భావి భారత పౌరులుగా.. ఎదిగేందుకు.. వారిచ్చిన.. స్ఫూర్తి ఎనలేనిదన్నారు.*

👉 *లక్ష్మీనారాయణ గారు నిజాయితీ గల అధికారిగా.. పేరు పొంది ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు.*

👉 *ఎంత ఎదిగిన ఒదిగుండాలన్న.. భావన.. లక్ష్మీనారాయణ గారిని చూస్తే అర్థమవుతుందన్నారు.*

ఈ కార్యక్రమంలో కళాశాల డీన్లు రామాంజనేయులు రెడ్డి, రాంగోపాల్ రెడ్డి, పాయసం రమేష్, ఏ ఒ హరి , చిరంజీవి సుధారాణి , మరియు అన్ని క్యాంపస్ ల ప్రిన్సిపల్స్, మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *