*రైతుల సమస్యలపై జెసి తో భేటి అయిన అయిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి*
– సహకార సొసైటి సిబ్బందికి పాత బకాయిలు చెల్లించాలి.
– అన్నదాలకు గిట్టుబాటు ధర దక్కేలా చొరవ తీసుకోండి.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
కోవూరు నియోజకవర్గం రైతు సమస్యల పై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు కలక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ కార్తీక్ గారితో సమావేశం అయ్యారు. ప్రభుత్వం వరి రైతులకు ప్రకటించిన గిట్టుబాటు ధర కల్పించేలా చొరవ తీసుకోవాలని కోరారు. రైతు సేవా కేంద్రాలలో ద్వారా జరిపే ధాన్యం కొనుగోళ్లులో కీలక పాత్ర పోషించే సహకార సొసైటీ సిబ్బందికి చెల్లించాల్సిన కమీషన్ల తాలూకు బకాయిలు చెల్లించాలని ఆమె జాయింట్ కలెక్టర్ కార్తీక్ గారి దృష్టికి తెచ్చారు. డెల్టా ప్రాంతమైన కోవూరు ప్రాంతంలో ఫిబ్రవరి రెండో వారం నుంచి వరి కోతలు మొదలవుతున్న నేపథ్యంలో రైతులకు ఖాళీ గోతాములు, హమాలీల కొరత రాకుండా చూడాలన్నారు. ధాన్యం రవాణాకు సంబంధించి ఎటువంటి అవాంతరాలు లేకుండా అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, నియోజక పరిధిలోని రైతు నాయకులు మరియు నీటి సంఘ నాయకులు అత్తిపల్లి శివారెడ్డి, ఆదాల శివారెడ్డి, నెల్లూరు రమణారెడ్డి, మందపాటి రమణారెడ్డి, బత్తుల హరికృష్ణ, పాశం శ్రీహరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.