*టిడిపి కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్ద పీట*

– కోవూరు సి హెచ్ సి నూతన భవనానికి 5 కోట్లతో పంపిన ప్రతిపాదనలకు ప్రభత్వ సానుకూల స్పందన.
– విపిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో మార్చురీకి ఫ్రీజర్ వితరణ.
– దివ్యాంగ సర్టిఫికేట్ల జారీ విషయంలో జాప్యం చేయవద్దని డాక్టర్లకు సూచన
– నైట్ షిఫ్ట్ కు హాజరు కాని వైద్య సిబ్బందిపై చర్యలు తప్పవు.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

మెరుగైన వైద్య సేవలు అందివ్వడంతో పాటు ప్రజలకు ఆరోగ్య సంబంధిత విషయాలపై అవగాహన కల్పించాలని డాక్టర్లను కోరారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. హాస్పిటల్ అభివృద్ధి కమిటి చైర్మన్ హోదాలో కోవూరు కమ్యూనిటి హెల్త్ సెంటర్ లో జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు పాల్గొన్నారు. అటెండెన్స్ రిజిస్టర్ తెప్పించుకొని డాక్టర్లు యితర వైద్య సిబ్బంది హాజరును పరిశీలించారు. కోవూరు కమ్యూనిటి హెల్త్ సెంటర్ లో అందిస్తున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మార్చరీలో మృదేహాలు భద్రపరిచేందుకు ఫ్రీజర్ లేదన్న విషయాన్ని తెలుసుకొని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆసుపత్రికి కావాల్సిన ఫ్రీజర్, మరియు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామీ యిచ్చారు. మెడిసిన్స్ కొరత లేకుండా చూసుకోవాలని ఫార్మసిస్ట్ కు సూచించారు. గత కొన్ని నెలలుగా సెలవులో వున్న గైనకాలజిస్ట్ స్థానంలో వీలైనంత త్వరగా కొత్త వారి నియామకానికి సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని కోరారు. అత్యవసర వైద్య సేవలకై నైట్ షిఫ్ట్ లో వైద్య సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మీడియా మాట్లాడుతూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తూ బడ్జెట్ లో 18 వేల 421 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. కోవూరు కమ్యూనిటి హెల్త్ సెంటర్ స్థానంలో 5 కోట్ల వ్యయంతో నూతన భవనం నిర్మించే విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లి వైద్యం చేయించుకోలేని పేదల పట్ల మానవతా దృక్పధంతో వ్యవహరించి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కోరారు. అంగ వైకల్యం వున్న వారికి యిచ్చే దివ్యాంగ సర్టిఫికేట్ల విషయంలో జాప్యం చేయవద్దని ఈ సందర్భంగా డాక్టర్లను ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలో వార్డులను సందర్శించి రోగులకు అందించే వైద్య సేవల గురించి ఆరా తీశారు. కోవూరు కమ్యూనిటి హెల్త్ సెంటర్ నిర్వహణకు సంబంధించి ఆర్ధిక అనుమతులను ఆమోదించారు. ప్రతి నెల తప్పనిసరిగా హాస్పిటల్ డెవలెప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని డాక్టర్లను అభివృద్ధి కమిటీ సభ్యులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కోవూరు కమ్యూనిటి హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట చలపతి, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు మల్లికార్జునరెడ్డి, సుగుణమ్మ, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, టిడిపి నాయకులు అత్తిపల్లి శివారెడ్డి, కాటంరెడ్డి కృష్ణా రెడ్డి, ఎంపిపి పార్వతి, కోవూరు సర్పంచ్ విజయమ్మ, వేగూరు సర్పంచ్ అమరావతి, టిడిపి మండల అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, మాజీ ఎంపిపి యాకసిరి వెంకటరమణమ్మ, మైనారిటి నాయకులు జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *