*రథయాత్ర విజయవంతానికి సహకరించిన వేమిరెడ్డి దంపతులకు ధన్యవాదాలు*
హరే కృష్ణ మంత్ర ప్రచారమే లక్ష్యంగా నెల్లూరు ఇస్కాన్ సంస్థ ఇటీవల చేపట్టిన 12వ జగన్నాథ రథయాత్ర విజయవంతంపై ఇస్కాన్ బృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. ఈ మేరకు మంగళవారం కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారిని విపిఆర్ నివాసంలో కలిసి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఇస్కాన్ సంస్థ అభివృద్ధికి ఎంపీ వేంరెడ్డి దంపతులు ప్రతి ఏటా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మూలాపేటలోని ఆంజనేయస్వామి విగ్రహం నుంచి మొదలైన యాత్రలో వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని అన్నారు. దీనిద్వారా హరే కృష్ణ మంత్రం జిల్లా అంతటా వ్యాపించిందని చెప్పారు. రథయాత్రలో భాగంగా ముంబయ్ నుంచి వైష్ణవాగ్రి, హోసూర్ నుంచి శ్రీనివాస శ్యాం ప్రభు, ఇతర ముఖ్య వ్యక్తులు పాల్గొని ప్రవచనాలు అందించారన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దంపతులు.. ఇస్కాన్ అభివృద్ధికి, రథయాత్రకు తమవంతు సంపూర్ణ మద్దతు అందించారని ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. రథయాత్ర సందర్భంగా 6 లక్షల ఆర్థిక సహాయం అందించి భక్తుల కొరకు ప్రత్యేక భోజన వసతి కల్పించారన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఇస్కాన్ సంస్థ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.