*ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులతో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్ష*

*హాజరైన ఆర్డీఒ నాగ అనూషా, జెడ్పీ సీఈఓ, పీజీఆర్ఎస్ నోడల్ ఆఫీసర్ విద్యారమ, డ్వామా పీడీ గంగాభవాని, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, పంచాయతీ రాజ్ ఏఈలు*

*పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేకంగా చర్చ*

*ప్రతి సమస్యను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి*

*గిరిజనులకు ఆధార్ కార్డులు నమోదు చేయించడంతో పాటు రేషన్ కార్డులు, పక్కా ఇళ్లు, పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు అందేలా చూడాలి*

*ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి*

*ఇంకా ప్రారంభం కాని సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులను వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలి*

*విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కీలక సంస్కరణలు చేపట్టిన నేపథ్యంలో తరగతుల విలీనం కారణంగా సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *