_*వి ఎస్ యూ లో జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది…*_
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC), జిల్లా ఏంప్లాయ్మెంట్ ఆఫీసు, సీడాప్ సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో మొత్తం 68 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. వివిధ రంగాల నుంచి వచ్చిన ప్రముఖ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలు, ఎంపిక ప్రక్రియల తర్వాత 39 మంది అభ్యర్థులు ఉద్యోగాలను పొందారు.
ఈ విజయవంతమైన జాబ్ మేళా సందర్భంగా APSSDC జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అబ్దుల్ ఖయ్యూం, జిల్లా ఏంప్లాయ్మెంట్ ఆఫీసర్ వినయ్ కుమార్, సీడాప్ కో కో ఆర్డినేటర్ డాక్టర్ జి.మేరీ సందీప్, మరియు విక్రమ సింహపూరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్. విజయ భాస్కరరావు మాట్లాడుతూ,
“ఈ విధమైన జాబ్ మేళాలు నిరుద్యోగ యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాము” అని తెలిపారు.