రాష్ట్రంలో రైల్వేల అభివృద్దికి కేంద్రం పెద్దపీట వేస్తోంది – ఎంపీ వేమిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు కేటాయించడంపై నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి 9,417 కోట్లు కేటాయించి రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి ఊతం ఇచ్చారని అభిప్రాయపడ్డారు. ఈ కేటాయింపు గత యుపిఐ ప్రభుత్వ కేటాయింపుల కన్నా 11 రెట్లు ఎక్కువ అని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.84,559 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు నడుస్తున్నాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వానికి ఇది నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబు గారి సారధ్యంలో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో మరిన్ని ప్రాజెక్టులు రానున్నాయన్నారు. నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి 103 కోట్లు ఖర్చు చేస్తుండడంపై జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం ఏపీలోని 16 జిల్లాల మీదుగా 8 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయన్న కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌.. త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్లను కేటాయిస్తామని చెప్పడం సంతోషకరమన్నారు. అలాగే 110, 130, 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడవడానికి వీలయ్యే వివిధ రైల్వే ట్రాక్ లను ఏపీలో అభివృద్ధి చేయనుండటం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed