*సర్వేపల్లి సమగ్ర అభివృద్ధే లక్ష్యం*

*నిత్యం తిట్ల దండకం చదివే వారిని పట్టించుకోం..ప్రజలకు మంచి చేసుకుంటూ పోతాం*

*ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తాం*

*పొదలకూరులో రూ.20 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

వైసీపీ ఐదేళ్ల పాలనలో పనులు చేయకుండానే బిల్లులు చేసేసుకున్నారు

టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంతో పారదర్శకంగా పనులు జరుగుతుంటే అవినీతి అని గగ్గోలు పెడుతున్నారు

ఏ ప్రభుత్వ హయాంలో దోపిడీ జరిగిందో ప్రజలు ప్రత్యక్షంగా గమనిస్తున్నారు

నన్ను తిట్టడానికే కాకాణి గోవర్ధన్ రెడ్డికి వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినట్టున్నారు

ఇసుకను ఉచితంగా ఇస్తుంటే నేను, నా కొడుకు రూ.100 కోట్లు దోపిడీ చేశామని మాట్లాడుతాడు

బ్రాందీషాపులు, బెల్టు షాపుల్లోనూ కాకాణి మాకు భాగాలు ఇచ్చాడు

ఇప్పుడు కొత్తగా మంత్రి నారాయణను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు

నిరంతరం రాష్ట్రం కోసం శ్రమించే నారాయణ గురించి మాట్లాడే అర్హత కాకాణికి లేదు

చిట్టేపల్లి తిప్ప వద్ద ఉన్న మెగా మినరల్ వాటర్ ప్లాంటును ఉపయోగంలోకి తేవాల్సిన బాధ్యత మాపై ఉంది

వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్లాంటును పూర్తిగా మూలన పెట్టడంతో మిషనరీతో పాటు వాహనాలు దెబ్బతిన్నాయ్

సోమశిల దక్షిణ కాలువ పెండింగ్ పనులు పూర్తి చేసి అమ్మవారిపాళెం పెద్దచెరువు, ప్రభగిరిపట్నం, కందమూరు చెరువుల కింద 4200 ఎకరాలకు నీళ్లు అందిస్తాం

మొదట ముత్తుకూరులో, ఆ తర్వాత పొదలకూరులో అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నాం

పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాం..త్వరలోనే అధికారికంగా ప్రారంభించుకోబోతున్నాం

రియల్ ఎస్టేట్ లేఅవుట్లలో ఓపెన్ ప్లేస్ గా వదిలిన స్థలాలను అన్యాక్రాంతం చేస్తే ఉపేక్షించబోం

ఎవరైనా అలాంటి స్థలాలను కొనుగోలు చేస్తే చెల్లవు…ఆ స్థలాలను కాపాడి పార్కులుగా అభివృద్ధి చేస్తాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *